చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించి… ఉత్తమ బాల నటుడిగా నేషనల్ అవార్డుని కూడా సొంతం చేసుకున్నాడు తరుణ్. ‘సూర్య ఐ.పి.ఎస్’, ‘అంజలి’, ‘తేజ’, ‘ఆదిత్య 369’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు. ప్రముఖ సీనియర్ నటి మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన రోజా రమణి కొడుకుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు తరుణ్. చైల్డ్ ఆర్టిస్ట్ గా సక్సెస్ అయిన తరుణ్.. అటు తరువాత చదువు నిమిత్తం కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. ఇక చదువు పూర్తయ్యాక మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ఆ దిశగా అడుగులు వేసాడు.
మిలీనియం ఆరంభంలోనే ‘నువ్వే కావాలి’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ మాత్రం చప్పుడు చెయ్యకుండా వచ్చిన ఆ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టించింది. 2000 వ సంవత్సరం అక్టోబర్ 13న విడుదలైన ‘నువ్వే కావాలి’ చిత్రం ఈరోజుతో 20 ఏళ్ళు పూర్తిచేసుకోబోతుంది. ఈ సందర్భంగా ‘నువ్వేకావాలి 20ఇయర్స్ సెలబ్రేషన్స్’ ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో హీరో తరుణ్ కూడా పాల్గొన్నాడు. అయితే తరుణ్ లుక్ అందరికీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. కొంచెం లావయ్యాడు.
మీసాలు తీసేసి. ఒత్తైన జుట్టుతో కనిపిస్తున్నాడు. అసలు ‘నువ్వే కావాలి’ చిత్రంలో ఉన్న తరుణ్ కు ఈ తరుణ్ కు అస్సలు సంబంధంలేదనే చెప్పాలి. అంతలా గుర్తుపట్టలేని విధంగా మారిపోయాడు తరుణ్. ఆ చిత్రం తరువాత ‘ప్రియమైన నీకు’ ‘నువ్వే లేక నేను లేను’ ‘నువ్వే నువ్వే’ వంటి హిట్లతో మంచి పేరే తెచ్చుకున్నాడు. మధ్యలో చేసిన ‘నవ వసంతం’ అనే చిత్రం కూడా పర్వాలేదు అనిపించింది.