Varun, Lavanya: వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ల ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్?

ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన భామ లావణ్య త్రిపాఠి… మెగా హీరో వరుణ్ తేజ్ తో ప్రేమలో ఉన్నట్లు.. ఇద్దరూ డేటింగ్ కూడా చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అవి ఇప్పటికీ ఆగలేదు అనుకోండి. వరుణ్ తేజ్.. లావణ్య త్రిపాఠి ఇంటికి వెళ్లి మరీ.. వాళ్ళ పెద్దలను ఒప్పించి, లావణ్య కి ప్రపోజ్ చేసి వచ్చినట్లు కూడా ప్రచారం జరిగింది. ఇందులో ఎంతవరకు నిజముందో తెలీదు కానీ మెగా ఫ్యామిలీలో జరిగే ఈవెంట్లకు మాత్రం లావణ్య త్రిపాఠి వెళ్ళు వచ్చేది.

అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ రూమర్స్ పై ఈ జంట ఎప్పుడు స్పందించినా ‘అలాంటిదేమి లేదు’ అంటూ సింపుల్ గా మాట దాటేసేది. అయితే వరుణ్ తేజ్.. సోదరి నిహారిక ఓ సందర్భంలో ‘అన్నతో రెండు సినిమాలు చేసిన లావణ్య అంటే నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో జరిగే ప్రతి వేడుకకు ఆమె హాజరవుతూ ఉంటుంది’ అంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.

అలాగే నాగ బాబు ఓ ఇంటర్వ్యూలో (Varun Tej) వరుణ్ – లావణ్య ల గురించి ప్రశ్నించగా.. ఆయన ‘నొ’ చెప్పలేకపోయాడు. సందర్భం వచ్చినప్పుడు ఆ విషయం పై అధికారికంగా స్పందిస్తాడు వరుణ్ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. వరుణ్ తేజ్ – లావణ్య ల నిశ్చితార్థం జూన్ లో జరగబోతుందట. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతానికి వరుణ్… ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతున్నాడు. ఇక లావణ్య పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. వరుణ్ – లావణ్య కలిసి ‘మిస్టర్’ ‘అంతరిక్షం’ వంటి సినిమాల్లో నటించారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus