మరో బైలింగువల్ సినిమాకి సైన్ చేసిన విజయ్
- February 1, 2019 / 07:00 AM ISTByFilmy Focus
విజయ్ దేవరకొండకి హిట్స్ ఉన్నాయి, బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి, డిజాస్టర్స్ కూడా ఉన్నాయి. అతడి ఫ్లాప్స్ కి కూడా అభిమానులు బాధపడలేదు కానీ.. తమిళంలోనూ పాగా వేయాలనే అత్యుత్సాహంతో చేసిన “నోటా” విషయంలో మాత్రం విజయ్ వీరాభిమానులు కూడా చాలా బాధపడ్డారు. దాంతో విజయ్ ముందు తెలుగులో ఒక నటుడిగా ప్రూవ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. కానీ.. మళ్ళీ మనసు చలించిందో లేక..
- స్నేహం వేరు.. పార్టీ వేరు’… పవన్ కళ్యాణ్ పై అలీ సంచలన కామెంట్లు..!
- ఆర్య – సయేషా.. పెళ్ళి డేట్ ఫిక్స్..!
- త్రివిక్రమ్, బోయపాటిలపై హేమ సెన్సేషనల్ కామెంట్స్
మనోడికి ఆశ పెరిగిందో తెలియదు కానీ.. ఆల్రెడీ తెలుగులో ఒక మూడు నాలుగేళ్లకు సరిపడా సినిమాలు సైన్ చేసిన విజయ్ దేవరకొండ మళ్ళీ తమిళంలో ఒక సినిమా సైన్ చేశాడని తెలుస్తోంది.టైమ్ మెషీన్ నేపధ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కనుందని. తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి ఓ కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహిస్తాడు. మరి ఈ న్యూస్ ఎంతవరకూ నిజం అనేది తెలియదు కానీ.. ప్రస్తుతానికైతే ట్రెండింగ్ లో ఉంది.












