నూతన నటీనటులతో సినిమా తీయడం దర్శకుడికి ఎంత రిస్కో.. కొత్త దర్శకుల సినిమాలో నటించడం హీరోకి అంతకంటే రిస్క్. అప్పటికే హిట్లు సాధించి ఉంటే.. కొత్త దర్శకుడు అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. అలా అలోచించి వెనకడుగు వేయకుండా నేటి హీరోలు ప్రతిభకలిగిన దర్శకులను ప్రోత్సహించారు. అవకాశ మిచ్చి స్టార్ డైరెక్టర్లుగా చేశారు. అటువంటి వారిపై ఫోకస్…
ప్రభాస్ వర్షం, ఛత్రపతి వంటి హిట్స్ సాధించిన ప్రభాస్ భయపడకుండా వంశీ పైడి పల్లికి అవకాశమిచ్చారు. అతని దర్శకత్వంలో మున్నా చేశారు. ఇది ఆశించినంతగా విజయం సాధించకపోయినప్పటికీ మరో దర్శకుడు కొరటాల శివని పరిశ్రమకు పరిచయం చేశారు. మిర్చి వంటి హిట్ అందుకున్నారు.
పవన్ కళ్యాణ్ ఇద్దరు సూపర్ ట్యాలెంట్ దర్శకులను పవన్ కళ్యాణ్ పరిచయం చేశారు. తొలి ప్రేమ ద్వారా కరుణాకర్, బద్రి ద్వారా పూరి జగన్నాథ్ తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు.
ఎన్టీఆర్ తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ డైరక్టర్ అయిన రాజమౌళికి అవకాశమిచ్చింది ఎన్టీఆర్. స్టూడెంట్ నంబర్ వన్ సినిమా ద్వారా జక్కన్న డైరక్టర్ అయ్యారు. అలాగే ఆది సినిమాతో వివి వినాయక్ డైరక్టర్ అయ్యారు.
నాగార్జున అక్కినేని నాగార్జున శివ సినిమాతో రామ్ గోపాల్ వర్మకి ఛాన్స్ ఇచ్చారు. అది సూపర్ హిట్ కావడంతో .. ఆనాటి నుంచి ఈనాటి వరకు కొత్తవారిని ప్రోత్సహించడంలో నాగ్ ఎప్పుడూ ముందున్నారు.
వెంకటేష్ అప్పటికే స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న వెంకటేష్ కొత్త డైరక్టర్ జయంత్ సి పరాంజీ తో పనిచేయడానికి ముందుకొచ్చారు. వీరికలయికలో వచ్చిన “ప్రేమించుకుందాం రా” మూవీ ట్రెండ్ సెట్టర్ అయింది.
చిరంజీవి అప్పుడప్పుడే నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్న చిరంజీవి… కోడి రామకృష్ణకి అవకాశమిచ్చారు. అతనితో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య మూవీ చేశారు.
అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో హీరోగా నిరూపించుకున్న అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాని కొత్త డైరక్టర్ సుకుమార్ తో సినిమా చేయడానికి ఒకే చెప్పారు. హిట్ అందుకున్నారు. పరిశ్రమకి స్టార్ డైరక్టర్ ని అందించారు.
రవితేజ రవితేజ ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేశారు. హరీష్ శంకర్ తనకి షాక్ ఇచ్చినప్పటికీ మళ్లీ రెండో అవకాశం ఇచ్చారు. మిరపకాయ్ ద్వారా డైరక్టర్ గా నిలబెట్టారు. భద్ర మూవీతో బోయపాటి శ్రీనుని పరిచయం చేశారు.
ఇలా స్టార్ హీరోలు పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ చిత్ర పరిశ్రమలో స్టార్ డైరక్టర్ గా ఎదగడం విశేషం.