తెలుగులో హవా తగ్గిపోయిన భామలు

సినిమా ప్రపంచం మాయాబజార్. ఇక్కడ ఒక సినిమాతో స్టార్స్ అయిపోతారు. అదే సినిమా బోల్తా కొడితే కనుమరుగు అవుతారు. అందుకే ఇక్కడ అభినయం.. అనుభవం తో పాటు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలని అంటుంటారు. రీసెంట్ గా కొంతమంది కథానాయిక కెరీర్ గ్రాస్ గమనిస్తే ఈ విషయాన్ని ఒప్పుకుంటారు. ఒక సమయంలో తెలుగులో జోరుగా సినిమాలు చేసిన తారలు.. నేడు చేతిలో ఒక తెలుగు సినిమాలేక ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారిపై ఫోకస్..

త్రిషTrishaవర్షం, నువ్వొస్తానంటే వద్దంటానా, అతడు.. ఇలా అనేక బ్లాక్ బస్టర్ హిట్స్ తో తెలుగులో దాదాపు జూనియర్, సీనియర్ హీరోలందరితో నటించిన ఈ భామ చేతిలో ప్రస్తుతం ఒక సినిమా కూడా లేదు. లయన్‌, నాయకి సినిమాలతో టాలీవుడ్ ఆమెకు టాటా చెప్పింది. ప్రస్తుతం త్రిష తమిళ, మలయాళ సినిమాలను నమ్ముకుంది.

శృతి హాసన్Shruthi Hassanతెలుగులో గబ్బర్‌సింగ్‌, రేసుగుర్రం, ఎవడు, శ్రీమంతుడు, ప్రేమమ్‌ వంటి వరుసగా హిట్స్ అందుకున్న శృతి హాసన్ కి సడన్ గా అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఆమె చేతిలో శభాష్‌నాయుడు చిత్రం మాత్రమే ఉంది. ఇది కూడా స్ట్రైట్ తెలుగు చిత్రం కాదు.

అంజలిAnjaliతెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళంలో సినిమాలు చేసి నిరూపించుకొని తెలుగు సినీరంగంలోకి వచ్చింది. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, బలుపు, గీతాంజలి వంటి చిత్రాలతో మెరిసిన అంజలికి అవకాశాలు తగ్గిపోయాయి. చిత్రాంగద చిత్రం తర్వాత ఆమె ఏ చిత్రానికి సైన్ చేయలేదు.

ప్రణీతPranithaకెరీర్ మొదట్లో హిట్స్ పలకరించకపోయిన అత్తారింటికి దారేది తో ప్రణీత వెలుగులోకి వచ్చింది. ఇక జోరుగా సినిమాలు చేస్తుందనుకుంటే బ్రహ్మోత్సవంతో ఆగిపోయింది. ఆ తర్వాత ఆమె తెలుగులో సినిమా చేయలేదు.

ప్రియా ఆనంద్‌Priya Anandలీడర్‌ లో ఆకట్టుకున్న ప్రియా ఆనంద్‌ తర్వాత రామ రామ కృష్ణ కృష్ణ, 180 చిత్రాలతో ముందుకు వచ్చింది. మంచి హిట్ లేకుండా పోయింది. తెలుగులో కో అంటే కోటి చిత్రం తర్వాత తెలుగులో అవకాశాలే లేకుండాపోయాయి. దాంతో తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ, కెరీర్‌ను నడిపిస్తోంది.

అవికా గోర్‌ Avika Gorఉయ్యాల జంపాల చిత్రం ద్వారా తెలుగు సినీరంగంలో హీరోయిన్‌గా పరిచయమైన అవికా గోర్‌ తెలుగువారికి కనెక్ట్ అయింది. ఆ సినిమాతో పాటు సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. మంచి నటిగా పేరు అందుకున్నప్పటికీ తెలుగు అవకాశాలు ఆమెకు వెతుక్కోవడం లేదు.

ముందుగా చెప్పుకున్నట్టు సినిమా రంగం రంగుల రాట్నం వంటిది. తెలుగులో ఛాన్స్ లేకున్న వీరిలో సడన్ గా వరుసగా నాలుగైదు చిత్రాలకు సైన్ చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు.

Share.