RRR Movie: రాజీపడని తారక్, జక్కన్న.. ఏమైందంటే..?

2021 సంవత్సరంలో భారీ అంచనాలతో విడుదల కాబోతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారనే సంగతి తెలిసిందే. బాహుబలి 2 తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్ హక్కులు ఏకంగా 900 కోట్ల రూపాయలకు అమ్ముడవడం గమనార్హం. సినిమాలో ప్రతి సన్నివేశానికి ప్రత్యేకత ఉండేలా జాగ్రత్త పడే రాజమౌళి టేకింగ్, మేకింగ్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సైతం సినిమాలో సీన్ కోసం నటనలో అస్సలు రాజీ పడరు. ఆర్ఆర్ఆర్ సినిమాలో అండర్ వాటర్ సీక్వెన్స్ ఉండగా ఈ సన్నివేశంలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించారని సమాచారం.

ఆర్ఆర్ఆర్ సినిమాలో హైలెట్ సీన్ ఇదేనని తెలుస్తోంది. రాజమౌళి విజన్ కు తగిన విధంగా తారక్ సన్నివేశానికి నూటికి నూరు శాతం న్యాయం చేశారని సమాచారం. కొన్ని నెలల క్రితం ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్ కు, పులికి మధ్య ఫైట్ సీన్ ఉందనే వార్త వినిపించింది. ఆర్ఆర్ఆర్ సినిమా లీకైన ఫోటోలలో తారక్ పులితో ఫైట్ చేసే సీన్ కు సంబంధించిన ఫోటో కూడా లీకైంది. ఈ సినిమాలో ఇంటర్వెల్ ట్విస్ట్ ప్రేక్షకుల అంచనాలకు అందని విధంగా ఉంటుందని సమాచారం.

బాహుబలి 2 సినిమా కలెక్షన్లతో కొత్త రికార్డులు క్రియేట్ చేసిన రాజమౌళి డైరెక్షన్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ 2,000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించే అవకాశాలు ఉన్నాయని ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ మారనుందని జోరుగా ప్రచారం జరుగుతున్నా రాజమౌళి మాత్రం చెప్పిన డేట్ కే సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ షూటింగ్ దాదాపుగా పూర్తి కావడం, అక్టోబర్ నెల నాటికి కరోనా ఉధృతి తగ్గే అవకాశం ఉండటంతో అక్టోబర్ 13వ తేదీనే ఆర్ఆర్ఆర్ రిలీజయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Most Recommended Video

వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus