రవితేజ కు చాలా స్పెషల్ మూవీ ‘డిస్కో రాజా’..!

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా విభిన్న చిత్రాలు తెరకెక్కించే విఐ ఆనంద్ డైరెక్షన్లో రూపొందుతోన్న తాజా చిత్రం ‘డిస్కో రాజా’. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రం టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తమన్ సంగీతంలో వచ్చిన రెండు పాటలకు కూడా మంచి స్పందన లభించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి కొంత ప్యాచ్ వర్క్ ను షూట్ చేస్తున్నారట. జనవరి 24న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ఇదివరకే చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. ‘ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

ఇక సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్ చేయడం .. నభా నటేష్, పాయల్ రాజ్ పుత్, తాన్య హోప్ వంటి ముగ్గురు హీరోయిన్ల గ్లామర్ .. తమన్ సంగీతం లో వచ్చే పాటలు విజయాల గా అద్భుతంగా ఉండడం .. తమిళ స్టార్ హీరో బాబీసింహా విలక్షణమైన విలనిజం .. ‘డిస్కో రాజా’ చిత్రానికి హైలెట్ గా నిలువబోతున్నాయని సమాచారం. ఇక ఈ చిత్రం రవితేజ కెరీర్లోనే ప్రత్యేకంగా నిలిచిపోతుందనీ… తప్పకుండా తనకి బ్లాక్ బస్టర్ అందిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

రూలర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రతిరోజూ పండగే సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus