ఏపీలో టికెట్ రేట్ల ఇష్యు నేషనల్ వైడ్ ఎంత హాట్ టాపిక్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు ఉన్న టికెట్ రేట్లు యాజ్ ఇట్ ఈజ్ గా ఉంచేసినా సరిపోయేది కానీ జగన్ ప్రభుత్వం.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై, అతని సినిమాల పై కక్ష్య కట్టి.. టికెట్ రేట్లను భారీగా తగ్గించేశారు. అక్కడ జనాలు నిత్యావసరాల రేట్లు పెరిగిపోయి అల్లాడిపోతుంటే.. కేవలం సినిమా టికెట్ రేట్ల పై మాత్రమే ఫోకస్ పెట్టి..
వాళ్ళు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. చిరంజీవి వంటి పెద్దలు వెళ్ళి వాళ్ళను బ్రతిమిలాడితే పారితోషికాలు కాకుండా రూ.100 కోట్లు పైగా బడ్జెట్ అయిన సినిమాలకు రిలీజ్ టైంలో కొన్ని రోజులు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ జీవోలు పాస్ చేశారు. 5వ షో లకి కూడా అనుమతులు ఇచ్చారు. ‘రాధే శ్యామ్’ ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి సినిమాలకు టికెట్ రేట్ల హైక్స్ ఇచ్చింది జగన్ ప్రభుత్వం.
ఆ సినిమాలు పారితోషికాలు కాకుండా రూ.100 కోట్లు బడ్జెట్ అయిన సినిమాలు. ఇప్పుడు ‘ఆచార్య’ కి కూడా అక్కడ రూ.25 నుండీ రూ.50 టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పిస్తుందట జగన్ ప్రభుత్వం. ‘ఆచార్య’ సినిమా పారితోషికాలు కాకుండా రూ.100 కోట్లు బడ్జెట్ అయిన మూవీ కాదు. అయినా టికెట్ రేట్లు పెంపుకి ఎలా ఒప్పుకున్నారు అని కొంతమంది ఆంధ్రకు చెందిన నెటిజన్లు మరియు అక్కడి పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
చిరు.. జగన్ ను ఇండస్ట్రీ తరుపున బ్రతిమిలాడుకున్నది ఒక కారణమైతే ‘ఆచార్య’ నిర్మాతలు జగన్ కు దూరపు బంధువులు అవ్వడం అనేది మరొక కారణంగా ఇండస్ట్రీ చర్చించుకుంటుంది. వీటిలో నిజానిజాలు ఏంటన్నది తేలాల్సి ఉంది.మరోపక్క తెలంగాణలో కూడా ‘ఆచార్య’ కి టికెట్ రేట్ల హైక్ ఉంటుందని తెలుస్తుంది. ఏప్రిల్ 29న ‘ఆచార్య’ విడుదల కాబోతుంది.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!