‘రాధే శ్యామ్’ తర్వాత ప్రభాస్ నుండి రాబోతున్న సినిమా ‘ఆదిపురుష్’. ప్రభాస్ హిందీలో నటించిన స్ట్రైట్ మూవీ ఇది. చాలా వరకు సినిమాలో బాలీవుడ్ క్యాస్టింగే ఉంది. ‘తానాజీ’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన ఓం రౌత్ దర్శకుడు. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. జూన్ 16 న ఈ మూవీ హిందీ, తెలుగుతో పాటు తమిళ,మలయాళ భాషల్లో కూడా ఏకకాలంలో రిలీజ్ కాబోతోంది. మొదట ఈ చిత్రం పై అంచనాలు పెద్దగా ఏర్పడలేదు.
కానీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక.. ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. అందువల్ల అభిమానుల్లో కూడా జోష్ పెరిగింది. అయితే ఓవర్సీస్ లో ఈ మూవీకి ఆదిలోనే దురుదెబ్బ తగిలినట్టు అయ్యింది. విషయం ఏంటంటే.. ‘ఆదిపురుష్’ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఈ మధ్యనే ఓపెన్ అయ్యాయి. కానీ ఎక్కువ స్క్రీన్స్ లో ఓపెన్ కాలేదు. అందుకు కారణం.. ఓవర్సీస్ లో ‘ఆదిపురుష్’ సినిమాకి ఎక్కువ స్క్రీన్స్ దొరకలేదట.
‘ఆదిపురుష్’ (Adipurush) రిలీజ్ నాటికి హాలీవుడ్ మూవీ ‘ఫ్లాష్’ కూడా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాబట్టి.. ఆ మూవీకి ఎక్కువ స్క్రీన్స్ ఇచ్చారట. షోలు కూడా ఆ మూవీకే ఎక్కువ బుక్ అవుతున్నట్టు వినికిడి. ‘ఆదిపురుష్’ కి లిమిటెడ్ స్క్రీన్స్, షోలు మాత్రమే లభించాయి. అందులో కూడా కేవలం త్రీడి బుకింగ్స్ మాత్రమే ఎక్కువ జరుగుతున్నాయట.
టుడి(2D ) బుకింగ్స్ అంతంత మాత్రమే జరుగుతున్నట్టు వినికిడి. ‘ఆదిపురుష్’ ను ఓవర్సీస్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి టి.సిరీస్ వారు విశ్వప్రయత్నాలు మొదలుపెట్టారు. చివరికి ఏం జరుగుతుందో చూడాలి.