Mahesh Babu, Rajamouli: మహేష్ జక్కన్న మూవీపై అంచనాలు పెంచుతున్న న్యూస్ ఇదే!

మహేష్ రాజమౌళి కాంబో మూవీపై ఆకాశమే హద్దుగా ఊహించని స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా 600 కోట్ల రూపాయల నుంచి 700 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కనుందని తెలుస్తోంది. హాలీవుడ్ లెవెల్ లో ఈ సినిమా తెరకెక్కనుండగా వచ్చే ఏడాది సమ్మర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ పేరును పరిశీలిస్తున్నారని బోగట్టా. స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమాలో ప్రధాన పాత్రలకు నటులను ఎంపిక చేస్తున్నారని సమాచారం అందుతోంది.

ఈ సినిమాలో ప్రముఖ హాలీవుడ్ నటులలో ఒకరైన శామ్యూల్ ఎల్ జాక్సన్ నటిస్తున్నారని సమాచారం అందుతోంది. మార్వల్ మూవీస్ ద్వారా పాపులర్ అయిన ఈ నటుడు సినిమాలో నటిస్తే సినిమాకు కచ్చితంగా ప్లస్ అవుతుందని జక్కన్న భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే శామ్యూల్ ఈ సినిమాలో నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. జక్కన్న ఈ సినిమా కోసం హాలీవుడ్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకున్నారని తెలుస్తోంది. మహేష్ సినిమా కోసం జక్కన్న భారీ లెవెల్ లో ప్లాన్ చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేసిన తర్వాత రాజమౌళి సినిమాపై దృష్టి పెట్టనున్నారు. జక్కన్న డైరెక్షన్ లో నటించడం కోసం మహేష్ బాబు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. మహేష్ జక్కన్న కాంబో మూవీకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఆ అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా జక్కన్న జాగ్రత్తలు తీసుకుంటున్నారని బోగట్టా.

సినిమాసినిమాకు జక్కన్న రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. జక్కన్న ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. మహేష్ బాబు రెమ్యునరేషన్ కూడా ఇంచుమించుగా దాదాపుగా ఇదే స్థాయిలో ఉందని సమాచారం అందుతోంది.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!</s

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus