అసలే చిరంజీవి సినిమా, 150 కోట్ల భారీ బడ్జెట్, అన్నిటికీ మించి బయోపిక్.. అది కూడా స్వాతంత్ర పోరాటం నేపధ్యంలో. మెగా అభిమానులకు ఇంతకుమించి కావాల్సింది ఏముంది. రీఎంట్రీ మూవీగా “కత్తి” రీమేక్ లో నటించిన చిరంజీవిపై విరుచుకుపడిన వారందరూ 151వ సినిమా కోసం చిరంజీవి ఎంచుకొన్న కథ చూసి ఆశ్చర్యపోయారు. కథకు తగ్గట్లే అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, నయనతార వంటి బహుభాషల్లో ప్రఖ్యాతులైన నటీనటులను సినిమాలో క్యాస్ట్ చేయడం, రెహమాన్, రవివర్మన్, రాజీవన్ వంటి అత్యుత్తమ సాంకేతిక నిపుణులను కూడా యూనిట్ లో భాగస్వాములను చేయడంతో “బాహుబలి” అనంతరం ప్రపంచ స్థాయిలో నైపుణ్యంతో తెరకెక్కుతున్న చిత్రంగా “సైరా నరసింహారెడ్డి” పేరు తెచ్చుకొంది.
ఆ పేరును ఇంకాస్త ఇనుమడింపజేసేందుకు రామ్ చరణ్ అండ్ టీం అన్నివిధాలుగా ప్రయత్నిస్తున్నారు. యుద్ధ నేపధ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడం.. సినిమాలో యుద్ధాలకు ఎక్కువ స్కోప్ కూడా ఉండడంతో హాలీవుడ్ సూపర్ హిట్ సినిమా “స్పైడర్ మ్యాన్”కి ఫైట్స్ కంపోజ్ చేసిన టాంగ్ లీని “సైరా నరసింహారెడ్డి” సినిమాలో ఫైట్స్ కంపోజ్ చేయడం కోసం ఎంపిక చేసుకొన్నారు. సినిమా స్థాయి రోజురోజుకూ పెరుగుతుండడంతో.. ప్రేక్షకుల్లోనూ సినిమాపై అంచనాలు అదే స్థాయిలో పెరుగుతున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.