Sivaji movie: రజినీ కాంత్ ‘శివాజీ’ సినిమాలో డైరెక్టర్ శంకర్ ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడబ్బా!

మన టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమాలంటే గుణ శేఖర్ గుర్తొస్తారు.. అదే ఇండియాలో భారీ బడ్జెట్ అండ్ టెక్నికల్ వాల్యూస్‌‌తో చిత్రాలంటే సిల్వర్ స్క్రీన్ సెల్యులాయిడ్ శంకర్ షణ్ముగం పేరే చెప్తారు.. ‘జెంటిల్ మెన్’ తో మొదలైన శంకర్ సినీ ప్రస్థానంలో ఒక్కో సినిమా ఒక్కో విజువల్ వండర్.. కథకు తగ్గట్టే ఖర్చు పెట్టిస్తుంటారాయన.. ‘జీన్స్’ మూవీలో ఒక్క పాటలో ప్రపంచంలోని ఏడు వింతలను చూపించాలనే ఆయన ఐడియానే గ్రేట్ అసలు..

ఆయన సినిమాల్లో పాటలంటే సిగరెట్, టాయిలెట్‌కి లేవరు ఆడియన్స్.. అలా ఆ మాయాజాలాన్ని కళ్లప్పగించి చూస్తూనే ఉంటారు.. ప్రేమకథలతో పాటు.. లంచం, అవినీతి అనే అంశాలే హైలెట్‌గా కథలు రాస్తుంటారాయన.. ప్రజెంటేషన్ విషయానికొస్తే వేటికవే విభిన్నంగా ఉంటాయి.. తమిళంతో తెలుగులోనూ ఆ మాటకొస్తే ఇండియా అంతటా అభిమానులను సంపాదించుకున్న స్టార్ డైరెక్టర్, సిల్వర్ స్క్రీన్ సెల్యులాయిడ్ శంకర్.. ‘రోబో’ ఫంక్షన్లో స్వయంగా చిరంజీవే మీతో సినిమా చేయాలనుందనే కోరికను బయటపెట్టారంటే ఆయన క్రేజ్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు..

అలాంటి శంకర్, సూపర్ స్టార్ రజినీ కాంత్‌తో తీసిన ‘శివాజీ’ చిత్రం విషయంలో చిన్న మిస్టేక్ చేశారంటూ.. సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది.. విలన్ దృష్టిలో చనిపోయిన తర్వాత రజినీ.. ఎన్టీ రాంగారావు పేరుతో మారో వేషంలో వస్తాడు.. అప్పుడు తను రంగారావే అని, అమెరికా నుండి వచ్చానని నిరూపించుకోవడానికి గ్రీన్ కార్డ్ చూపిస్తారు రజినీ.. ఆ కార్డ్ మీద డేట్ ఆఫ్ బర్త్.. 30/05/1974, 2010లో కార్డ్ మెంబర్ అయితే..

2007లో ఎక్స్‌పైర్ అయినట్లు ఉంటుంది.. ‘‘యూఎస్ నుండి వచ్చేటప్పుడు ఏ పోలీస్ చూసుకోడూ?’’ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.. ఇక ఎవరికి వారు బుర్రలకు పదును పెట్టి రకరకాల కామెంట్స్ చేస్తూ.. ఎవరికి వారు ఇంటిలిజెంట్స్‌లా ఫీలయిపోతున్నారు.. ప్రస్తుతం ఈ పోస్ట్, దానికి సంబంధించిన పంచాయితీ ట్విట్టర్‌లో చక్కర్లు కొడుతోంది.. 2007లో వచ్చిన ‘శివాజీ’ తమిళ్, తెలుగులోనూ సూపర్ హిట్ అయింది..

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus