పవన్ కళ్యాణ్ .. ఓ అంతుబట్టని వ్యక్తి. అందరీ హీరోల్లా సినిమాలే చేస్తారు.. ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటారు. తెలుగు యువత గుండెల్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. పవన్ కళ్యాణ్ అత్యున్నత శిఖరంలా ఎదగడానికి దోహదం అయిన సంగతులు ఏంటి ? పవర్ స్టార్ గా ఎదగడానికి ఆయనలో ఉన్న పవర్స్ ఏమిటి ? అనే అంశం పై ఫిల్మ్ ఫోకస్ చేసిన పరిశోధాత్మక కథనం ఇది.
1. స్వశక్తి పరుడుమెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పవన్ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టినా, పవర్ స్టార్ గా ఎదిగింది మాత్రం వారసత్వం వల్ల కాదు. పెద్ద వృక్షం నీడలో పెరగడం కష్టమని గుర్తించి తొలి చిత్రం నుంచే తనకంటూ సొంత దారిని ఎంచుకున్నాడు. ఎవరిని అనుకరించలేదు. అన్నయ్యను అసలు ఫాలో కాలేదు.
2. స్వతంత్ర వ్యక్తిత్వంసలహాలు తీసుకోవడం పవన్ కి చిరాకు. ఏ నిర్ణమైన సొంతంగా తీసుకుంటాడు. అది ఒప్పు అయినా, తప్పు అయినా పూర్తి భాద్యత అతనే వహిస్తాడు. ఒకరి మీద ఆధార పడడం ఇష్టముండదు. స్వతంత్ర వ్యక్తిత్వం పవన్ కు అయన తండ్రి కొణిదెల వెంకట రావు నుంచి వచ్చిందని కుటుంబ సభ్యులు చెప్పారు.
3. సహజ నటుడుపవన్ లాజిక్ లేని కథల జోలికి వెళ్లరు. ఫాంటసీకి చాలా దూరం. సూపర్ మ్యాన్ పాత్రల్లో కనిపించరు. మన పక్కింటి అబ్బాయి ఎలా ఉంటాడు ? వాడు చేసే పనులు ఏమిటి ? కాలేజీ కుర్రోడి గొడవలు ఎలా ఉంటాయి ? ఇలాంటి కథలతో సినిమాలు చేసి యువతకు బాగా కనెక్ట్ అయ్యారు.
4. దేశభక్తుడుపవన్ కు దేశమంటే నిజమైన భక్తి. మనం మాత్రమే బాగుండాలని పవర్ స్టార్ కోరుకోరు. మన చుట్టూ ఉన్నవాళ్లు, సమాజం బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటారు. అందుకోసం ప్రజల పక్షాన పోరాడుతాడు.
5. ముసుగులు వేసుకోడుపవన్ కళ్యాణ్ కి ముక్కు మీద కోపమనీ, ఎవరితో కలవరని అంటుంటారు. వాస్తవం … అనవసరపు మాటలు మాట్లాడడు అంతే. సహజంగా, స్వంత సిద్ధంగా స్పందిస్తారు. ఏవో ముసుగులు వేసుకొని ప్రవర్తించడు. స్వచ్ఛత, నిజాయితీ నిండిన ప్రవర్తనే. సంతోషమొస్తే సంతోషంగా.. ఓపమొస్తే కోపంగా ఉంటాడు. అన్యాయం జరుగుతుంటే అంతే కోపంగా తిరగబడతాడు.
6. మంచి వ్యక్తిపవన్ కళ్యాణ్ కన్నా మంచి నటులుంటారేమో గానీ.. ఆయనంత మంచి వ్యక్తి సినీ పరిశ్రమలో అరుదుగా ఉంటారని పవన్ తో సినిమాలు చేసిన డైరక్టర్లు చెప్పారు. సిన్సియర్ గా పని చేస్తాడు, సీనియర్లు అంటే గౌరవం ఇస్తాడని వెల్లడించారు.
7.తాత్విక చింతనా పరుడుశాంతి, సమరం కలిసిన వ్యక్తి పవన్. మహావతార్ బాబాజీ, పరమ హంస యోగానంద, రమణ మహర్షి, జిడ్డు కృష్ణ మూర్తి వంటి గొప్ప తత్వవేత్తల రచనలను ఆయన ఒంట బట్టించుకున్నారు. విప్లవ యోధుడు చేగువేరా అంటే విపరీతమైన అభిమానం.
8. స్వేదం చిందిస్తూ..అన్నీ అందుబాటులో ఉన్నా మితమైన ఆహారం తీసుకుంటారు. ఇరవై ఏళ్లుగా ఒకే రీతిలో ఉండే విధంగా శరీరాన్ని నియంత్రణలో పెట్టుకున్నారు. వీలు చిక్కితే వ్యవసాయ పనులు చేస్తూ చెమటని చిందిస్తారు.
9. గొప్పలకు పోడుతన సినిమాలు గురించి పవన్ ఎప్పుడు గొప్పలు చెప్పరు. పదేళ్లుగా తన సినిమాలు పరాజయం పాలవుతున్నా వేదిక లెక్కి మాట్లాడలేదు. తొలి సారి అత్తారింటికి దారేది పైరసీ గురించి మాత్రమే ఎక్కువ సేపు మాట్లాడారు.
10. సేవకుడుఎంత సైలంట్ గా ఉంటే అంత పవర్ వస్తుంది.. అంటుంటారు. పవన్ కూల్ గా ఉండడమే కాదు. సైలంట్ గానే సాయం చేస్తారు. ప్రచారానికి దూరంగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు.
ఇలా పవన్ లోని ఎన్నో గుణాలు తెలుగు ప్రజలకు నచ్చాయి. అందుకే ఆయన్ను గొప్పగా చూస్తారు. అభిమానిస్తారు. ఆరాధిస్తారు. పవర్ స్టార్ అనే కిరీటాన్ని అందించారు.