Naga Chaitanya: గీతా – చైతన్య సినిమా గురించి డబ్బు డౌట్లు.. నిజమేనా?

నాగచైతన్యకు సాలిడ్‌ మాస్ హిట్‌ పడి చాలా రోజులైంది. దీని కోసం గీతా ఆర్ట్స్‌ ఓ ప్లాన్‌ రెడీ చేస్తోందని సమాచారం. ఈ మేరకు చైతన్యతో గతంలో ఓ సినిమా చేసిన దర్శకుడితో సినిమా కుదిర్చారు. అతనే చందూ మొండేటి. ‘సవ్యసాచి’ అనే సినిమా ఈ కాంబోలో వచ్చింది. ఆ సినిమా సరైన విజయం అందుకోకపోయినా.. చైతన్యను సరికొత్తగా చూపించారు అనే పేరు అయితే సంపాదించారు. ఇప్పుడు ఆ సినిమా చేదు ఫలితాన్ని మరిపించేలా కొత్త కథను సిద్ధం చేసుకున్నారని టాక్‌.

ఈ సినిమాకు సంబంధహంచి త్వరలోనే ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అంటున్నారు. అయితే ఈ సినిమా కథ ఇదే అంటూ ఓ పుకారు బయటకు వచ్చింది. కథకు సంబంధించిన కీలక పాయింట్ బన్నీ వాస్ నుండే బయటికి వచ్చింది. గుజరాత్‌లో జరిగిన ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా చందూ మొండేటి ఓ కథ రాసుకున్నారట. ఇందులో చైతన్య బోటు డ్రైవర్‌గా కనిపిస్తాడట. ఇందులో ప్రేమకథతో పాటు ఎమోషన్స్, యాక్షన్స్, ఎలివేషన్స్ ఓ రేంజ్‌లో ఉంటాయట.

ఈ సినిమాకు సుమారు ₹60 కోట్ల దాకా బడ్జెట్ అనుకుంటున్నారట. (Naga Chaitanya) చైతు కెరీర్‌లో ఇదే హయ్యెస్ట్ బడ్జెట్‌ అవుతుంది. అంతేకాదు ఈ బడ్జెట్‌కు అల్లు అరవింద్ ఓకే చేశారని కూడా అంటున్నారు. ఈ మేరకు కథా చర్చలతోపాటు, లుక్స్‌ విషయంలోనూ ఓ క్లారిటీకి వచ్చేశారట. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తెరకెక్కుతుండే సరికి సినిమాలో ఎక్కువసేపు చైతు గళ్ల లుంగీ, చొక్కాలతో కనిపిస్తాడని చెబుతున్నారు.

‘కస్టడీ’ సినిమా సరైన విజయం అందుకోకపోవడంతో చైతన్యకు సరైన సాలిడ్‌ మాస్‌ హిట్‌ అవసరం ఏర్పడింది. మరి చందూ మొండేటి రాసిన ఈ కథ ఎంతవరకు చైతుకు సాయపడుతుందో చూడాలి. చందు మొండేటి టాలెండెట్‌ దర్శకుడే అయినా నిఖిల్‌ సినిమాలతోనే ఎక్కువగా విజయాలు సాధిస్తున్నారు. మరి చైతన్యతో రెండో ప్రయత్నంగా వస్తున్న ఈ సినిమాతో ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus