సుకుమార్ తన సినిమాలకు సంబంధించిన క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడరనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప పార్ట్1కు ఏకంగా 180 కోట్ల రూపాయలు ఖర్చైందని తెలుస్తోంది. సినిమా రిలీజ్ వాయిదా పడటం వల్ల సినిమా బడ్జెట్ పెరిగిందని సమాచారం. ఈ సినిమాలో పాటల కోసమే ఏకంగా 10 కోట్ల రూపాయల ఖర్చైందని తెలుస్తోంది. అనుకున్న బడ్జెట్ కంటే ఈ సినిమాకు ఎక్కువే ఖర్చు చేసినా ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది.
ఈ సినిమాలోని దాక్కో దాక్కో మేక సాంగ్ కు 3 కోట్ల రూపాయలు ఖర్చైందని, సామి సామి పాటకు 2 కోట్ల రూపాయలు ఖర్చైందని, ఈ సినిమాలో సమంతతో తెరకెక్కించే స్పెషల్ సాంగ్ కోసం మరో మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారని తెలుస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ సినిమాకు హైలెట్ గా నిలిచేలా ఉండనుందని మరో వారం రోజుల్లో ఈ సాంగ్ షూటింగ్ పూర్తి కానుందని సమాచారం అందుతోంది.
పుష్ప పార్ట్1 రిలీజ్ డేట్ మారనుందని వార్తలు వస్తున్నా ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. వరుస విజయాలతో జోరుమీదున్న సుకుమార్ పుష్ప సినిమాతో హ్యాట్రిక్ సాధిస్తానని భావిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు క్లాస్ సినిమాలను ఎక్కువగా తెరకెక్కించిన సుకుమార్ ప్రస్తుతం మాస్ ప్రేక్షకులు మెచ్చే సినిమాలపై దృష్టి పెట్టి ఆ సినిమాలనే ఎక్కువగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాసినిమాకు సుకుమార్ క్రేజ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!