సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో థియేటర్లలో రిలీజవుతోంది. దాదాపుగా రెండున్నరేళ్ల తర్వాత మహేష్ నటించి రిలీజవుతున్న సినిమా కావడంతో సర్కారు వారి పాట సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. హిట్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుందనడంలో సందేహం అవసరం లేదు. థియేటర్లలో మరే సినిమా నుంచి పోటీ లేకపోవడంతో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో స్క్రీన్లు దక్కాయి.
హైదరబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో మహేష్ బాబుకు కూడా వాటా ఉందనే సంగతి తెలిసిందే. ఏఎంబీ సినిమాస్ లో సర్కారు వారి పాట 30 షోలు ప్రదర్శితం అవుతుండగా అన్ని షోలు హౌస్ ఫుల్ కావడం గమనార్హం. ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వాళ్లు కాకుండా కొత్తగా ఎవరైనా ఈ నెల 12వ తేదీన సినిమాను చూడాలంటే మాత్రం ఏఎంబీ సినిమాస్ లో ఒక్క టికెట్ కూడా అందుబాటులో లేదు.
ఆదివారం వరకు ఏఎంబీ సినిమాస్ లో సర్కారు వారి పాట సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో జరుగుతుండటంతో మహేష్ బాబు అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు. మహేష్ బాబు క్రేజ్ చూసి నెటిజన్లు సైతం అవక్కవుతున్నారు. తొలిరోజు సర్కారు వారి పాట రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించడం ఖాయమని చెప్పవచ్చు. ఏపీలో మాత్రం కొన్ని జిల్లాల్లో అడ్వాన్స్ బుకింగ్ మొదలుకాలేదు. కొన్ని థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్ మొదలైనా 12వ తేదీ నుంచి కాకుండా 13వ తేదీ నుంచి సర్కారు వారి పాట టికెట్లు అందుబాటులో ఉన్నాయి.
మహేష్ బాబుకు సినిమాసినిమాకు క్రేజ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది. ఒక్కో సినిమాకు మహేష్ బాబు 50 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. మహేష్ బాబు నిర్మాతగా మిడిల్ రేంజ్ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
Most Recommended Video
అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!