ఈ మధ్య కాలంలో వీక్ డేస్ లో థియేటర్లలో సినిమాలను చూసే ప్రేక్షకుల సంఖ్య భారీగా తగ్గింది. మరీ పాజిటివ్ టాక్ వస్తే మాత్రమే థియేటర్లలో సినిమాలను చూద్దామని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ మినహా మరే సినిమాను థియేటర్లలో చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడలేదు. అయితే రెండేళ్లలో కొత్తగా 10,000 స్క్రీన్ల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నారని సమాచారం అందుతోంది.
సీఎన్సీ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ 100 నుంచి 200 సీట్ల సీటింగ్ సామర్థ్యంతో ఉన్న థియేటర్లను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.
ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో ఈ థియేటర్లను ఏర్పాటు చేయనున్నారని సమాచారం. భారీ ఖర్చుతో ఒక్కో థియేటర్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయని సమాచారం అందుతోంది. ఎక్కువ సంఖ్యలో థియేటర్లు అందుబాటులో ఉండటం వల్ల పెద్ద సినిమాలకు ప్రయోజనం కలుగుతుంది. పెద్ద సినిమాలకు ఈ మధ్య కాలంలో పండుగల సమయంలో థియేటర్లను కేటాయించడం కష్టమవుతోంది. భారీ సంఖ్యలో థియేటర్లు ఏర్పాటు కావడం ద్వారా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి.
అదే సమయంలో టికెట్ రేట్లు కూడా తగ్గే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. తక్కువ ధరకే టికెట్లు అందుబాటులో ఉంటే థియేటర్లలో సినిమాలను చూసే ప్రేక్షకుల సంఖ్య కూడా పెరుగుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీ సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి. 300, 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో సినిమాలను నిర్మించడానికి నిర్మాతలు వెనుకాడటం లేదు.
అదే సమయంలో ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో రిలీజ్ చేసి ఫస్ట్ వీకెండ్ నాటికి బ్రేక్ ఈవెన్ అవ్వాలని ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో సినిమాలను రిలీజ్ చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. థియేటర్ల సంఖ్య భారీగా పెరగడం వల్ల పెద్ద సినిమాలకు సమస్యలు తగ్గుతాయని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.