బుల్లి రాజు డిమాండ్ మామూలుగా లేదుగా..!

వెంకటేష్ (Venkatesh Daggubati)  – అనిల్ రావిపూడి (Anil Ravipudi)  కాంబినేషన్లో వచ్చిన మూడో సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’  (Sankranthiki Vasthunam) ఇప్పటికీ ఓటీటీలో సందడి చేస్తూనే ఉంది. థియేటర్లలో మిస్ అయిన ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని ఇంట్లో కూర్చొని వీక్షిస్తున్నారు. అందుకే ఓటీటీలో కూడా ఈ సినిమా రికార్డులు సృష్టిస్తుంది. ఇదిలా ఉండగా.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవ్వడానికి సంక్రాంతి సీజన్ తో పాటు ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి బుల్లి రాజు పాత్ర అని కూడా చెప్పాలి.

Revanth

సినిమాలో హీరో కొడుకు పాత్ర అది. తండ్రి అతిగారాబం, ఓటీటీలు.. ఎలా పిల్లల్ని చెడగొడతాయి? అనేది ఈ పాత్రతో సినిమాలో చాలా ఎంటర్టైనింగ్ గా చెప్పారు. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ పాత్ర అందుకే బాగా కనెక్ట్ అయ్యింది అని చెప్పాలి. బుల్లి రాజు పాత్ర చేసిన పిల్లాడు రేవంత్ (Revanth) కూడా బాగా పాపులర్ అయిపోయాడు. ప్రస్తుతం చైల్డ్ ఆర్టిస్టుల కొరత కూడా టాలీవుడ్లో ఉంది.

దానిని బుల్లి రాజు భర్తీ చేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతం రేవంత్ కి చాలా సినిమాల్లో ఛాన్సులు వస్తున్నాయట. కానీ అతని ఇంట్లో వాళ్ళు దేనికీ ఒప్పుకోవడం లేదు అని తెలుస్తుంది. సినిమాల వల్ల పిల్లాడి చదువుకి ఇబ్బంది వస్తుందని, పైగా భీమవరం నుండి ప్రతిసారి హైదరాబాద్ కి తీసుకు రావాలంటే చాలా ఖర్చు, టైం పెట్టాల్సి వస్తుందని వారు చెబుతున్నారట. అందుకే రోజుకి లక్ష పారితోషికం చెల్లిస్తే.. పంపుతామని రేవంత్ కుటుంబ సభ్యులు చెబుతున్నారట.

సో వాళ్ళ ఫైనల్ డిమాండ్ అది అని గ్రహించిన నిర్మాతలు.. అందుకు ఓకే చెబుతున్నారట. చిరంజీవి (Chiranjeevi) – అనిల్ రావిపూడి కాంబోలో రూపొందే సినిమా కోసం రేవంత్ ని ఫైనల్ చేశారు. ఈ సినిమాకి కూడా రేవంత్ కి అదే రేంజ్లో పారితోషికం చెల్లిస్తున్నట్టు సమాచారం. జూన్ లేదా ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది. 2026 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

‘ఓదెల 2’ కి క్రేజీ డీల్స్.. అంత బడ్జెట్ పెట్టినా రికవరీ అయిపోయింది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus