వెండి తెరపై సూక్తులు చెప్పడమే కాదు నిజ జీవితంలో వాటిని పాటించి సూపర్ స్టార్ మహేష్ బాబు నిజమైన శ్రీమంతుడు అనిపించుకున్నారు. తన సొంత గ్రామమైన బుర్రిపాలెం (గుంటూరు జిల్లా)తో పాటు తెలంగాణలోని సిద్ధాపూర్ (మహబూబ్ నగర్) గ్రామాన్నిదత్తత తీసుకొని వాటిని ఆదర్శవంతంగా తీర్చి దిద్దాలని సంకల్పించారు. కేవలం ఆర్ధిక సాయం అందించి వదలకుండా అన్ని విభాగాల్లో అభివృద్ధి కోసం నిపుణులతో ప్రణాళిక రచించారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ రెండు గ్రామాల స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకొని పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నారు. ముందుగా శుభ్రతపై ద్రుష్టి పెట్టారు. డ్రైనేజి వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. అందుకే రోడ్లను బాగు చేయిస్తున్నారు. ప్రిన్స్ షూటింగ్ లో బిజీగా ఉన్న తన దత్తత గ్రామాల్లో జరుగుతున్న పనులపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యానికి కావాల్సిన ఏర్పాట్లు చేయమని తమ టీమ్ తో చెప్పినట్లు సమాచారం. అందుకే ప్రతి వారం ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ, ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తున్నారు. దత్తత తీసుకున్న రెండు గ్రామాలను స్మార్ట్ విలేజెస్ గా తీర్చిదిద్దాలని మహేష్ కృషి చేస్తున్నట్లు ఆయా గ్రామాల్లో పర్యటన సందర్భంగా నమ్రత చెప్పారు. అందుకు అనుగుణంగా పనులు వేగంగా జరుగుతున్నాయి.