Adipurush: ఆదిపురుష్ ఆ రేంజ్ లో కలెక్షన్లను సాధించే ఛాన్స్ ఉందా?

ప్రభాస్ హీరోగా ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఆదిపురుష్ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా విడుదల కావడానికి మరో రెండు వారాల సమయం మాత్రమే ఉంది. జూన్ నెలలో రిలీజ్ కానున్న సినిమాల్లో అత్యంత భారీ స్థాయిలో అంచనాలు ఉన్న మూవీ ఇదే కావడం గమనార్హం. అయితే ఈ సినిమా తొలిరోజే 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉందని ప్రభాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంతకంతకూ ఆసక్తి పెరగడంతో పాటు ప్రస్తుతం థియేటర్లలో ఉన్న సినిమాలేవీ ఆశించిన రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకోకపోవడంతో ఈ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆదిపురుష్ సినిమాకు కచ్చితంగా పాజిటివ్ టాక్ వస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. రాముని పాత్రకు ప్రభాస్ పూర్తిస్థాయిలో న్యాయం చేసి ఉంటారని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఆదిపురుష్ సినిమా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరు అభిమానులను ఆకట్టుకుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఆదిపురుష్ సినిమాకు థియేటర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఓవర్సీస్ లో కూడా భారీ సంఖ్యలో థియేటర్లలో ఈ మూవీ విడుదల కానుంది. ఆదిపురుష్ మూవీపై దర్శకుడు ఓం రౌత్ సైతం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే ఓం రౌత్ తర్వాత ప్రాజెక్ట్ లకు ఇతర భాషల్లో సైతం మంచి బిజినెస్ జరిగే ఛాన్స్ అయితే ఉంది.

ఆదిపురుష్ (Adipurush) మూవీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి రాబోయే రోజుల్లో రిలీజయ్యే సినిమాలకు సరికొత్త టార్గెట్లను ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. త్వరలో ఆదిపురుష్ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus