Balakrishna, Anil Ravipudi: బాలయ్య ఫ్యాన్స్ ను అనిల్ రావిపూడి మెప్పించగలరా?

  • January 13, 2023 / 03:49 PM IST

స్టార్ హీరో బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేదని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా యావరేజ్ లేదా అబవ్ యావరేజ్ గా నిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా ఫలితం వల్ల అనిల్ రావిపూడిపై ఒక విధంగా ఒత్తిడి పెరుగుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. బాలయ్య తర్వాత సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

బాలయ్య ఫ్యాన్స్ ను మెప్పిస్తూనే అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమాను తెరకెక్కించాల్సిన బాధ్యత అనిల్ రావిపూడిపై ఉంది. అనిల్ రావిపూడి ఇప్పటికే వరుస విజయాలతో డబుల్ హ్యాట్రిక్ ను సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి మాస్ సినిమాలను సైతం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించగలరు. ఈ ఏడాది ఫస్టాఫ్ లోనే బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీ రిలీజ్ కానుంది. సాహో గారపాటి నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఈ సినిమా ఏకంగా 80 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. బాలయ్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలకృష్ణ రేంజ్ అంతకంతకూ పెరగాలని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను బాలయ్య ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది. మాస్, ఫ్యాక్షన్ సినిమాలకు బాలయ్య కొంతకాలం దూరంగా ఉండాలని వ్యక్తమవుతున్నాయి.

బాలయ్య పారితోషికం ఏకంగా 20 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని తెలుస్తోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా నటుడిగా బాలయ్య రేంజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus