భారీ ధర పలికిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఓవర్సీస్ హక్కులు
- April 3, 2017 / 10:57 AM ISTByFilmy Focus
ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో విజయాలతో యువసామ్రాట్ నాగచైతన్య దూసుకుపోతున్నారు. ఇప్పుడు హ్యాట్రిక్ అందుకోవడానికి సిద్ధమవుతున్నారు. అక్కినేని నాగార్జునకు సోగ్గాడే చిన్ని నాయన వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన కల్యాణ్ కృష్ణ ప్రస్తుతం చైతూకి విజయాన్ని ఇవ్వడానికి శ్రమిస్తున్నారు. అతని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న “రారండోయ్ వేడుక చూద్దాం” మూవీ ఫస్ట్ లుక్ ఉగాదికి రిలీజ్ అయి అభినందనలు అందుకుంది. సినిమాపై నమ్మకాన్ని పెంచింది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని కొనుగోలు చేయడానికి క్యూ కడుతున్నారు.
ఇప్పటికే ఈ మూవీ ఓవర్సీస్ థియేటర్స్ హక్కులను భారీ ధర చెల్లించి “యూఎస్ తెలుగు మూవీ ఎల్ఎల్ సీ” అనే కంపెనీ సొంతం చేసుకున్నట్లు తెలిసింది. ఆ కంపెనీ వారు ఎక్కువ థియేటర్లలో “రారండోయ్ వేడుక చూద్దాం” సినిమాని ప్రదర్శించే ఆలోచనలో ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమాలో ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా సూపర్ సక్సస్ అవుతుందని నాగార్జున ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















