Allari Naresh: అల్లరి నరేష్ జాతకం బాలేదా.. వరుస షాకులతో ఇబ్బందేనా?

టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన అల్లరి నరేష్ ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు యావరేజ్ రివ్యూలు వచ్చినా కలెక్షన్లు మాత్రం దారుణంగా ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఈ సినిమా ఫెయిలైంది. ఈ సినిమాతో పోల్చి చూస్తే అల్లరి నరేష్ గత సినిమాలు బెటర్ కలెక్షన్లను సాధించాయనే సంగతి తెలిసిందే. అల్లరి నరేష్ కు కామెడీ సినిమాలు సూట్ అయిన స్థాయిలో సీరియస్ సినిమాలు సూట్ కావని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

కామెడీ సినిమాలతోనే మెజారిటీ సందర్భాల్లో సక్సెస్ దక్కిన నేపథ్యంలో అల్లరి నరేష్ ఆ దిశగా అడుగులు వేస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయని ఫ్యాన్స్ చెబుతున్నారు. సీరియస్ సినిమాలలో నటించడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. తన కామెడీ టైమింగ్ తో కోట్ల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న అల్లరి నరేష్ సినిమాలు మరీ దారుణంగా వసూళ్లను సొంతం చేసుకుంటూ ఉండటం ఇండస్ట్రీ వర్గాలను షాక్ కు గురి చేస్తోంది.

క్రేజ్ ఉన్న దర్శకుల దర్శకత్వంలో నటించడంపై అల్లరి నరేష్ దృష్టి పెడితే బాగుంటుందని మరి కొందరు చెబుతున్నారు. నరేష్ కు సినిమా ఆఫర్లు ఎక్కువగానే వస్తున్నా క్రేజ్ మాత్రం తగ్గుతోంది. నరేష్ తన సినీ కెరీర్ పై సరిగ్గా దృష్టి పెట్టకపోతే ఆయన ఇండస్ట్రీకి దూరం కావడానికి ఎంతో సమయం పట్టదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

ప్రయోగాత్మక సినిమాలు ప్రతిసారి సక్సెస్ ను ఇవ్వవని అల్లరి నరేష్ గుర్తుంచుకోవాల్సి ఉంది. అల్లరి నరేష్ కొత్త ప్రాజెక్ట్ ల గురించి తెలియాల్సి ఉంది. నరేష్ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చి సంచలన విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus