సినిమా థియేటర్లలో కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అదెక్కడైనా కామన్. కానీ టికెట్ కొనుక్కుని థియేటర్ కు వచ్చే ప్రేక్షకులకు ఇవన్నీ అనవసరం. ఫైనల్ గా వాళ్ళే కింగ్స్. అందులో డౌట్ లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే.. థియేటర్ యాజమాన్యాలు ముందుగానే చెక్ చేసుకోవాలి. కొన్ని పల్లెటూర్లలో ఏసీ థియేటర్లలో జనాలు సినిమాలు చూడటానికి వెళ్తుంటారు. వేసవి కాలం అయితే ఇంకా ఎక్కువగా వెళ్తుంటారు. కానీ థియేటర్ యాజమాన్యాలు ఏం చేస్తాయి.
సినిమా స్టార్ట్ అయిన పావు గంట ఎసి వేసి తర్వాత ఆపేస్తాయి.. మళ్ళీ ఇంటర్వెల్ కు 5 నిమిషాల ముందు ఆన్ చేస్తాయి. అటు తర్వాత మళ్ళీ ఆపేసి క్లైమాక్స్ లో వేస్తాయి. బి,సి సెంటర్ ఆడియన్స్ ఇవన్నీ పట్టించుకోరు. వాళ్ళ బిజినెస్ అంతే అని సరిపెట్టుకుంటారు. కానీ మల్టీప్లెక్సుల్లో ఇలాంటి పరిస్థితులు వస్తే చాలా దారుణమని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ టికెట్ రేట్లు ఎక్కువగా ఉంటాయి. జి.ఎస్.టి లు కూడా వేస్తారు. మరి అలాంటప్పుడు ఇక్కడ తేడా వస్తే ప్రేక్షకులు ఊరుకుంటారా?
మహేష్ బాబు మల్టీప్లెక్స్ అయిన ‘ఏఎంబీ సినిమాస్’ చాలా ఫేమస్. అయితే ఇటీవల విడుదలైన ‘బిచ్చగాడు 2’ (Bichagadu 2) సినిమాని ఈ మల్టీప్లెక్స్ లో చూడటానికి వెళ్లిన ప్రేక్షకులకు పెద్ద షాక్ తగిలింది. అదేంటంటే సినిమాని సెకండ్ హాఫ్ నుండి స్క్రీనింగ్ చేశారట. విచిత్రం ఏంటంటే ఆ విషయం సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకులకు ఎండ్ కార్డ్స్ పడే వరకు తెలీదు. దీంతో థియేటర్ యాజమాన్యంతో వాగ్వివాదానికి దిగారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.