తేజ సజ్జా (Teja Sajja) ప్రశాంత్ వర్మ (Prashanth Varma) కాంబినేషన్ లో తెరకెక్కిన హనుమాన్ (Hanuman) తెలుగు వెర్షన్ ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జీ5 ఓటీటీ త్వరలో హనుమాన్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని ప్రకటన చేసింది. అయితే స్ట్రీమింగ్ డేట్ గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే ప్రశాంత్ వర్మ హనుమాన్ తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ గురించి చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. హనుమాన్ ఓటీటీ రిలీజ్ ఆలస్యమవుతోందని ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తోంది కాదని ఆయన తెలిపారు.
ఈ సినిమాను వీలైనంత త్వరలో ఓటీటీలో ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావడానికి మా టీమ్ రెస్ట్ లేకుండా పని చేస్తోందని ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు. మీకు ఉత్తమమైనది అందించాలన్నదే మా ఆలోచన అని దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని ప్రశాంత్ వర్మ వెల్లడించారు. మాకు సపోర్ట్ చేస్తున్న ఆడియన్స్ అందరికీ ధన్యవాదాలు అని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రశాంత్ వర్మ పోస్ట్ విషయంలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
కనీసం ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో వెల్లడించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎక్కువ సమయం ఎదురుచూడటం వల్ల సినిమాపై ఆసక్తి తగ్గుతుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హనుమాన్ మూవీ ఆలస్యంగా ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం వల్ల వ్యూస్ పై కూడా ఎఫెక్ట్ పడుతుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. హనుమాన్ మూవీ ఈ వారం కూడా స్ట్రీమింగ్ కావడం కష్టమేనా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
హనుమాన్ మూవీ ఓటీటీలో ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. సంక్రాంతి కానుకగా విడుదలైన ఇతర ఓటీటీ సినిమాలు గత నెలలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన సంగతి తెలిసిందే. హనుమాన్ సక్సెస్ తో తేజ సజ్జా రేంజ్ ఊహించని స్థాయిలో పెరిగిందనే సంగతి తెలిసిందే. తేజ సజ్జా భవిష్యత్తు సినిమాలతో భారీ విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.