సినీ పరిశ్రమలో హీరో హీరోయిన్లకు సక్సెస్ రేటు ఎలా ఉన్నా మెయింటెనెన్స్ కు మాత్రం గట్టిగానే ఖర్చు చేస్తారు. బౌన్సర్లకు డబ్బులు పెట్టాలి, మేనేజర్లకు కూడా లక్ష వరకు జీతం ఇవ్వాలి, ఇల్లు కచ్చితంగా లగ్జరీగా ఉండాలి, ఆఫీస్ కూడా అంతే..! ఎందుకంటే దర్శకనిర్మాతలు కథలు చెప్పడానికి వచ్చినప్పుడు పారితోషికం గట్టిగా డిమాండ్ చేయాలి కాబట్టి. సో సినిమాకి వీళ్ళు ఎంత తీసుకున్నా.. లోన్లతో కూడిన లగ్జరీ లైఫ్ ను మాత్రం కచ్చితంగా మెయింటైన్ చెయ్యాలి.
సామాన్యులకు దూరంగా ఎప్పుడూ ప్రత్యేకంగా ఉండే హీరో, హీరోయిన్లకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే తాజాగా ఓ హీరోయిన్ కోట్లు విలువగల లగ్జరీ కారును కొనుగోలు చేసింది. ఆమె మరెవరో కాదు ఢిల్లీ భామ హుమా ఖురేషి. ఈమె నార్త్ బ్యూటీ అయినప్పటికీ తమిళ సినిమాలతో ఎక్కువగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.’కాలా’ ‘వలీమై’ చిత్రాల్లో ఈమె ఎక్కువగా నటించి మెప్పించింది. తాజాగా ఈమె ఓ లగ్జరీ కారును కొనుగోలు చేసింది.
ఇది ఓ జర్మన్ బ్రాండ్ కారు అని తెలుస్తుంది. మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఎస్ 400డీ మోడల్ కారును కొనుగోలు చేసింది. దీని ధర రూ.1.19 కోట్లట. ఈ కారు 6.3 సెకన్లలో 100 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తుందట. ఈ కారు కొనుగోలు చేస్తున్నప్పుడు హుమా ఖురేషి తీసుకున్న ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ హిందీలో చేతినిండా సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతోంది
ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!
స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!