ఏపీలో 2024 ఎన్నికల్లో 24 అసెంబ్లీ స్థానాలలో 3 పార్లమెంట్ స్థానాలలో జనసేన పోటీ చేయనుంది. జనసేన పోటీ చేసే మిగతా స్థానాలు ఇవేనంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. అయితే జనసేన తక్కువ స్థానాలలో పోటీ చేయడం విషయంలో కొంతమంది జనసైనికుల నుంచి తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పవన్ కళ్యాణ్ ఆ నిర్ణయం తెలుసుకోవడం వెనుక అసలు కారణాలు ఇవేనంటూ హైపర్ ఆది జనసైనికులకు హితబోధ చేశారు.
పవన్ సినిమాల్లో కోట్ల రూపాయల పారితోషికం వచ్చే ఛాన్స్ ఉన్నా ప్రజల సమస్యల కోసం పోరాడుతున్నాడని ఆయన తెలిపారు. సొంత కష్టార్జితంతో పవన్ పార్టీని నడుపుతున్నాడని ప్రస్తుతం అప్పు చేసి పార్టీని నడిపిస్తున్నాడని ఆయన కామెంట్లు చేశారు. ప్రతిపక్షంలో ఉండి కూడా కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకుంటున్న వ్యక్తి పవన్ మాత్రమేనని కౌలు రైతుల కోసం పవన్ సొంత పిల్లల డబ్బులను సైతం ఖర్చు చేశారని హైపర్ ఆది చెప్పుకొచ్చారు.
నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా అభిమానులు కట్టుబడి ఉండాలని పవన్ కళ్యాణ్ ను తక్కువ చేసి మాట్లాడవద్దని హైపర్ ఆది సూచనలు చేశారు. ప్రజల కోసం సొంత డబ్బులను ఖర్చు చేస్తున్న నేత పవన్ మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు. హైపర్ ఆది చేసిన కామెంట్లు నిజమేనని జనసైనికులు చెబుతున్నారు. హైపర్ ఆది కామెంట్లకు పవన్ ఫ్యాన్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.
ఏప్రిల్ నెలలో ఏపీలో ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. త్వరలో పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానం వివరాలు కూడా వెల్లడి కానున్నాయి. భీమవరం లేదా తిరుపతిలో పవన్ పోటీ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రజల ప్రేమకు మాత్రమే బానిస అని హైపర్ ఆది (Hyper Aadhi) కామెంట్లు చేశారు. పవన్ వరుసగా పొలిటికల్ కార్యక్రమాలతో బిజీ అవుతుండటం గమనార్హం.