Hyper Aadhi: పవిత్ర-లోకేష్ ను పవిత్ర- నరేష్ అంటూ హైపర్ ఆది సెటైర్లు..!

నరేష్‌-పవిత్రా లోకేష్‌ల వ్యవహారం అందరికీ తెలిసిందే. మధ్యలో నరేష్ మూడో భార్య చేసిన హంగామా గురించి కూడా అందరికీ తెలిసిన విషయమే. నరేష్‌.. పవిత్రా లోకేష్‌ తో సహజీవనం చేస్తున్నాడు అని.. నాలుగో పెళ్ళికి కూడా సిద్దమయ్యాడు అని, పవిత్ర వలనే తమ కాపురం చెల్లాచెదురు అయిపోయింది అని రమ్య రఘుపతి ఆరోపణలు చేసింది. మీడియాని వెంటేసుకుని మరీ కర్ణాటకలో ఓ హోటల్లో ఉన్న నరేష్- పవిత్ర లను పట్టించి, ఆమె మరింత పాపులర్ అయ్యింది.

ఆమె ఆరోపణలు ఎలా ఉన్నా.. రమ్య రఘుపతి టాలీవుడ్లో కొందరు సెలబ్రిటీల దగ్గర డబ్బులు తీసుకుని ఎగ్గొటినట్టు కూడా గతంలో ప్రచారం జరిగింది. దీంతో ఆమె ఆరోపణలు కూడా పూర్తిస్థాయిలో చెల్లడం లేదు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.తాజాగా వీరి వ్యవహారం పై హైపర్ ఆది వేసిన సెటైర్లు హాట్ టాపిక్ అయ్యాయి. నరేష్- పవిత్ర టాపిక్ పై శ్రీదేవి డ్రామా కంపెనీ తాజా ఎపిసోడ్ లో ఆది ఓ స్కిట్ వేశాడు.

ఇందులో హైపర్ ఆది, రాంప్రసాద్ ల మధ్య క్యాలెండర్ లాంచ్ విషయంలో గొడవ వచ్చింది. దీంతో తమ మద్దతు దారులు తమ వైపుకి రావాలని పిలుచుకున్నారు.ఇందులో పరదేశీ, నూకరాజు, ప్రవీణ్ వంటి వారు జోడిలతో ఎంట్రీ ఇవ్వగా… నరేష్ టాపిక్ రావడంతో.. పవిత్ర ముందుకు వస్తుంది. నరేష్‌కు నేను ఉన్నాను అని పవిత్ర అంటుంది.. దీంతో ఆది ఎంట్రీ ఇచ్చి పంచ్ వేస్తాడు. నీ పేరేంటి అని పవిత్రను అడుగుతాడు ఆది. పవిత్ర అని ఆన్సర్ ఇస్తుంది.

వాడి పేరు ఏంటి అని ఆది అడుగుతాడు. నరేష్ అని చెబుతుంది పవిత్ర.ఇంకేం అన్నట్టుగా ఆది మొహం పెట్టేసి సైలెంట్ అవుతాడు.ఆది వేసిన పంచ్‌ చాలా సేపటికి కానీ ఎవ్వరికీ అర్థం కాలేదు. పవిత్ర నరేష్ అని అంటున్నాడని పంచ్ ప్రసాద్ క్లారిటీ ఇచ్చాక అందరూ నవ్వారు. ట్రెండింగ్ విషయాల పై స్కిట్లు వేయడం హైపర్ ఆదికి కొత్తేమి కాదు. అందుకే అతన్ని విమర్శించే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus