సింప్లిసిటీకి నేను మారు పేరు అంటున్న రాశిఖన్నా!
- August 30, 2017 / 07:28 AM ISTByFilmy Focus
టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో హిట్స్ అందుకుంటూ, అటు అందంతోను, ఇటు అభినయంతోను ఆకట్టుకుంటున్న హీరోయిన్ రాసిఖన్నా…అయితే ఈ ముద్దుగుమ్మ ఒకానొక ఇంటెర్వ్యులో మాట్లాదుతు తన గురించి, తన మనస్త్వతం గురించి, తన వ్యక్తిత్వం గురించి, తన స్నేహితుల గురించి చాలా విషయాలే చెప్పేసింది. మరి ఈ అమ్మడు చెప్పిన విషయాలు ఒకసారి మనం కూడా తెలుసుకుందామా…ఆమె తన గురించి మాట్లాడుతూ ఏమంటుంది అంటే…నేను అందరితోనూ కలివిడిగా ఉంటా. ఎవ్వరితోనైనా స్నేహం చేయడం నా స్వభావం. నాకు ఒక్కసారి పరిచయమైనా, మనసుకి నచ్చితే జీవితాంతం గుర్తుపెట్టుకొంటా’’ అంటోంది రాశీ ఖన్నా. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘జై లవకుశ’లో కథానాయికగా నటిస్తోంది. రాశీ మాట్లాడుతూ ‘‘నాకు స్నేహితులు ఎక్కువ.
ఎందుకంటే నాకు నచ్చితే అంత త్వరగా విడిచిపెట్టను. ఎప్పుడూ టచ్‌లో ఉంటా. స్నేహం అంటే అలానే ఉండాలి. నా స్నేహితులెవరూ నా నుంచి ఏదీ ఆశించరు. నన్ను కథా నాయికగానే చూడరు. వాళ్ల దగ్గరే నేను నేనుగా ఉంటా. ఆ వాతావరణం నాకు నచ్చుతుంది. స్నేహంలో ఉన్న గొప్పతనం అదే. ఎంత స్థాయికి వెళ్లిన వ్యక్తినైనా పేరు పెట్టి, ఏకవచనంతో పిలవొచ్చు. ఆ హక్కు, అధికారం స్నేహితులకే ఉంటుంది. నా గురించి ఏదీ దాచకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తారు. ఒక విధంగా నా గర్వం అణిచేది వాళ్లే’’ అంటోంది. అయినా డిల్లీకి రాజైనా తల్లికి కొడుకేగా అలానే రాశి ఇప్పుడు ఎంతతో హీరోయిన్ అయినా…తన వాళ్ళకు తాను తనదైన మనిషిగానే తెలుస్తుంది అని మరచిపోతే ఎలా?
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.












