మెగాస్టార్ చిరంజీవి నట వారసత్వాన్ని తనయుడు రామ్ చరణ్ తేజ్ అందుకున్నారు. అద్భుతంగా నటిస్తూ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఒక నటుడిగా బిజీగా ఉంటూనే అనేక వ్యాపారాలను నడిపిస్తున్నారు. పలు కంపెనీలకు యజమానిగా, సహా యజమానిగా కొనసాగుతున్నారు. రీసెంట్ గా నిర్మాతగానూ మారారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ స్థాపించి తండ్రి చిరంజీవితో ఖైదీ నంబర్ 150 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చెర్రీ పనులు చూస్తున్నప్పుడు ఇంతకీ అతనికి నటించడం ఇష్టమా? వ్యాపారం చేయడం ఇష్టమా? అని ఎవరికైనా అడగాలని ఉంటుంది.
అదే ప్రశ్నను ఓ ఇంటర్వ్యూ లో రామ్ చరణ్ ని యాంకర్ అడిగింది. అప్పుడు చెర్రీ మాట్లాడుతూ “నాకు బిజినెస్ గురించి కొంచెం కూడా తెలియదు. నా స్నేహితులు ఈ ప్రాజక్ట్ బాగుంది.. ఇందులో నువ్వు పెట్టుబడి పెడుతావా? అని అడిగినప్పుడు అందులో ఇన్వెస్ట్ చేస్తుంటా? అంతేగాని ఆఫీస్ కి వెళ్లి ఫైల్స్ చూసే ఓపిక నాకు లేదు. నాకు కంపెనీలు ఉన్నా.. బిజినెస్ మ్యాన్ ని మాత్రం కాదు. ఒక నటుడిగా ఉండడమే నాకిష్టం. ఈ రంగంలో ఎంత కష్టపడడానికైనా సిద్ధమే” అని వివరించారు. నిర్మాతగా అనుభవం ఎలా ఉంది? అని మరో ప్రశ్న అతని ముందు ఉంచగా..” ప్రొడ్యూసర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాను, ఎందుకంటే అది కూడా సినీ రంగమే కదా” అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.