కొంతమంది నటీమణులు ఎటువంటి మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తూ ఉంటారు. ఆ టైం లో వాళ్ళ ముక్కు సూటి తనాన్ని మెచ్చుకోవాలి అనిపిస్తుంది. కానీ అదే ముక్కు సూటి తనం కొన్ని సార్లు వాళ్ళని చిక్కుల్లో పడేసే అవకాశం కూడా ఉంది. అయితే కారణాలు ఏంటో తెలీదు కానీ… హిందీ బిగ్‌బాస్ షోలో గతేడాది కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి అలరించిన నియా శర్మ కి ఇప్పుడు అవకాశాలు లేవు.
మధ్యలో ‘జమై 2’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. దాని తర్వాత బిజీ అవుతుంది అనుకుంటే అలాంటిది ఏమీ జరగలేదు.కనీసం సీరియల్స్ లో కూడా ఈమెకు ఛాన్సులు లభించలేదు. దీంతో నియా బ్రేక్ తీసుకుందని అని అంతా అనుకున్నారు. ఈ ఊహాగానాలపై తాజాగా నియా స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. “నాకు నేనుగా బ్రేక్ తీసుకునేంత సీన్ నాకు లేదు. ఆ స్థాయిలో నేను సాధించింది ఏమీ లేదు. ఇప్పటికీ అవకాశాల కోసం, సంపాదన కోసం అడుక్కుంటూనే ఉన్నాను.
నాకు పని కావాలి. అలా అని ఏది పడితే అది చేయడానికి నేను సిద్ధంగా లేను. మంచి పాత్రలు వస్తే చేస్తాను. అందుకోసం నెలలు, సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సి వచ్చినా ఎదురుచూస్తూనే ఉంటాను. బ్యాక్ లక్ కొద్దీ కొన్నిసార్లు ఇదంత మంచిది కాదు. ఎందుకంటే ఈ నిరీక్షణ మనల్ని విషాదంలోకి,శూన్యంలోకి నెట్టేస్తుంది.
నన్ను ఆడిషన్ చేసి చాలాకాలమే అయ్యింది. అంతా ఆగిపోయింది. కానీ నాకంటూ ఓ రోజు వస్తుంది. ఆరోజు ఏదైనా పెద్ద అవకాశమే వరిస్తుంది. అప్పుడు తప్పకుండా దాన్ని స్వీకరిస్తాను” అంటూ చెప్పుకొచ్చింది నియా శర్మ.