మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముకుంద, కంచె సినిమాలో నటుడిగా నిరూపించుకున్నప్పటికీ.. మాస్ ప్రేక్షకులకి దగ్గరవ్వాలని చేసిన ప్రయత్నం దెబ్బకొట్టింది. పూరి జగన్నాథ్ తో చేసిన లోఫర్ ఆశించినంతగా విజయం సాధించలేదు. సో మాస్ పల్స్, కమర్షియల్ టెక్నీక్ తెలిసిన శ్రీనువైట్లతో కలిసి మిస్టర్ గా వస్తున్నారు. లావణ్య త్రిపాఠి, హేబా పటేల్ హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీ ఏప్రిల్ 14నెల వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శ్రీను వైట్ల మాట్లాడుతూ “వరుణ్ తేజ్ తన గత సినిమాల్లో కంటే మిస్టర్ లో చాలా గొప్పగా నటించాడు. ఆయన నటనలోని కొత్త యాంగిల్స్ ఈ చిత్రంలో బయటపడ్డాయి” అని తెలిపారు. ముఖ్యంగా వరుణ్ తేజ్ కామెడీ చేస్తుంటే పవన్ కళ్యాణ్ ను చూసినట్టే ఉందనే కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. డైరక్టర్ మాటలపై వరుణ్ స్పందించారు.
“మిస్టర్ సినిమాలో మంచి కామెడీ ఉంటుందని చెప్పగానే.. ముందుగా కామెడీ ఎలా చేయాలో నేర్చుకోవడం కోసం కళ్యాణ్ బాబాయ్, పెదనాన్న సినిమాలు ఎక్కువగా చూసా. బాబాయ్ సినిమాలో కామెడీ ట్రాక్ సపరేట్ గా ఉండదు. ఆయన పాటలు, మ్యానరిజంతో కామెడీ చేయగలరు. అది నాకు బాగా ఇష్టం. అంతేగాని వాళ్ళని ఇమిటేట్ చేయాలనీ ఎప్పుడూ అనుకోలేదు. కానీ కామెడీ సన్నివేశాల్లో నటించేప్పుడు కళ్యాణ్ బాబాయ్ స్టైల్ కనిపిస్తుందని శ్రీను వైట్ల చెప్పినప్పుడు ఆశ్చర్యం వేసింది ” అని వరుణ్ వెల్లడించారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.