బన్నీకి కొత్త టైటిల్ ఇచ్చిన సుకుమార్

మూడో సినిమాతోనే “స్టైలిష్ స్టార్” బిరుదు దక్కించుకుని, ఆ బిరుదుకు తగ్గట్లే సరికొత్త స్టైల్స్ ను సౌత్ సినిమాకు ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చాడు అల్లు అర్జున్. ఆన్ ది స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ ది స్క్రీన్ కూడా స్టైలిష్ గా ఉండే బన్నీ ఆ బిరుదుకు న్యాయం చేశాడు కూడా. అయితే.. ఇకపై బన్నీ స్టైలిష్ స్టార్ కాదు అంటున్నాడు సుకుమార్. నిన్న జరిగిన “చావు కబురు చల్లగా” ప్రీరిలీజ్ వేడుకకు ముఖ్య అతిధిగా విచ్చేసిన సుకుమార్ అక్కడ “పుష్ప” గురించి మాట్లాడుతూ “ఇక నుంచి స్టైలిష్ స్టార్ ను మర్చిపోండి,

ఇక నుంచి ‘మాస్ ఐకాన్’గా పిలవబడతాడు బన్నీ” అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మంచి హై ఇచ్చాడు. దాన్ని కంటిన్యూ చేస్తూ బన్నీ కూడా పుష్ప గురించి చెప్తూ “తగ్గేదే లే” అని చిత్తూరు యాసలో చెప్పిన డైలాగ్ కు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఆల్రెడీ విడుదలైన పోస్టర్, బన్నీ లుక్స్ ఊర మాస్ గా ఉండగా, ఏప్రిల్లో బన్నీ పుట్టినరోజు సందర్భంగా టీజర్ ను విడుదల చేసే ప్లాన్ లొ ఉన్నాడు సుకుమార్.

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలకానున్న ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ ఫిలిమ్ కావడంతో భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. సో, “పుష్ప”తో అల్లు అర్జున్ తన స్టైలిష్ స్టార్ బిరుదును కూడా సుకుమార్ చెప్పినట్లు మార్చేసుకుంటాడేమో చూడాలి.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus