అనంతపురంలో పరిశ్రమలు పెడుతామని, సెంట్రల్ వర్సిటీ ఏర్పాటు చేస్తామని ఊరించి, ఊరించి ప్రజలను వంచించకండని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జాతీయ, రాష్ట్ర నేతలకు విజ్ఞప్తి చేస్తారు. అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించిన బహిరంగ సభ లో ఆయన మాట్లాడారు. తాగడానికి గుక్కెడు నీరు లేని ఇక్కడ ఏ పరిశ్రమ పెడుతారని ప్రశ్నించారు. ఇప్పటికీ పునాది కూడా పడని పరిశ్రమలో ఎప్పుడు ఇక్కడి యువతకి ఉద్యోగాలు ఇస్తారని అడిగారు.
అది చేస్తాం.. ఇది చేస్తామని మాటలకే పరిమితమైతే 2019 ఎన్నికల్లో మేము ఏమి చేయాలో మాకు తెలుసు అని హెచ్చరించారు. మా భావా ఆవేశాలతో ఆడుకోడుకోకండని ఆవేశంతో మాట్లాడారు. ప్రజలకు అండగా నిలబడటానికి తాను 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే గా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. మీరు ఓట్లు వేసినా, వేయక పోయినా కచ్చితంగా పోటీచేస్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో జనసేన తొలి పార్టీ కార్యాలయాన్ని అనంతపురంలో ఏర్పాటు చేస్తానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.