Ichata Vahanamulu Nilupa Radu Collections:టాక్ బ్యాడ్.. ఓపెనింగ్స్ మరింత బ్యాడ్..!
- August 29, 2021 / 06:58 PM ISTByFilmy Focus
సుశాంత్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా ఎస్.దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. లెజెండ్రీ నటి భానుమతి రామకృష్ణ గారి మనవడు రవి శంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్లలతో కలిసి ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఆగస్ట్ 27న ఈ చిత్రం విడుదలైంది.టీజర్ ట్రైలర్లు ప్రామిసింగ్ గా ఉండడంతో సినిమా పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. కానీ ఈ మూవీ ఆ స్థాయిలో లేదు.

మొదటి రోజు కలెక్షన్స్ కూడా టాక్ కు తగ్గట్టే ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే :
| నైజాం | 0.04 cr |
| సీడెడ్ | 0.02 cr |
| ఉత్తరాంధ్ర | 0.03 cr |
| ఈస్ట్ | 0.02 cr |
| వెస్ట్ | 0.02 cr |
| గుంటూరు | 0.02 cr |
| కృష్ణా | 0.02 cr |
| నెల్లూరు | 0.01 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 0.18 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.01 Cr |
| వరల్డ్ వైడ్ (టోటల్) | 0.19 cr |
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రాన్ని చాలా వరకు ఓన్ రిలీజ్ చేసుకున్నారు నిర్మాతలు. అయినప్పటికీ రూ.2.25 కోట్ల వరకు షేర్ ను రాబడితే క్లీన్ హిట్ స్టేటస్ దక్కుతుంది.మొదటి రోజు ఈ చిత్రం కేవలం రూ.0.19 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.2.06 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
Click Here For Review
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

















