Allu Arjun: గౌరవ అతిథిగా సైనికులతో కలిసి సందడి చేసిన అల్లు అర్జున్?

మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారిలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఒకరు.ఇలా ఈయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈ విధంగా స్టైలిష్ స్టార్ గా సౌత్ ఇండస్ట్రీలో ఎంతో పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మారిపోయారు. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకోవడమే కాకుండా అల్లు అర్జున్ కు విపరీతమైన అభిమానులను సంపాదించి పెట్టింది. ఇక ఈ సినిమా మంచి విజయం కావడంతో ఈ సినిమాకి సీక్వెల్ గా పుష్ప 2 సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులను ప్రారంభించనుంది. తాజాగా అల్లు అర్జున్ తన భార్య అల్లు స్నేహ పుట్టిన రోజు సందర్భంగా

తన భార్య పిల్లలతో కలిసి అమృత్ సర్ స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే స్వర్ణ దేవాలయంలో అల్లు అర్జున్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో కలిసి దగ్గర్లోని వాఘా సరిహద్దుకు వెళ్లిపోయారు. పాకిస్థాన్ – భారత్ బార్డర్ లోని వాఘా చెక్ పోస్ట్ వద్ద బీఎస్ఎఫ్ జవాన్లతో కలిసి సందడి చేశారు.

ప్రతిరోజు బార్డర్ సైనికులు చేసే కవాతులో బన్నీ గౌరవ అతిథిగా పాల్గొన్నారు.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తన భార్య పిల్లలతో కలిసి అక్కడ ఉన్నటువంటి జవాన్లతో ఫోటోలు దిగారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇలా సైనికులతో అల్లు అర్జున్ ఎంతో సరదాగా గడపడంతో ఈ ఫోటోలు చూసిన అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus