Matrudevobhava: లెజెండరీ మూవీ రీమేక్‌పై నిర్మాత ఏమన్నారంటే…

సినిమా చూస్తే మనకు తెలియకుండా కన్నీళ్లు వచ్చేస్తాయా?… ఈ మాటకు సమాధానం తెలియాలి అంటే ‘మాతృదేవోభవ’ సినిమా చూసిన మీ ఇంట్లో పెద్దల్ని అడగండి. లేదంటో యూట్యూబ్‌లో ఆ సినిమా చూడండి. అంత ఓపిక లేదు అనుకుంటే ‘రాలి పోయే పువ్వా…’ అనే పాట ఉంటుంది అది చూడండి. అప్పుడు ఆటోమేటిక్‌గా మీకు విషయం అర్థమైపోతుంది. అంతలా నాడు ఏడిపించేసిన సినిమా అది. అలాంటి సినిమాను మళ్లీ నేటితరం ప్రేక్షకులకు అందించాలని ఆ సినిమా నిర్మాత చూస్తున్నారు.

‘మాతృదేవోభవ’ వచ్చి 28 ఏళ్లవుతోంది. కె. అజయ్‌ కుమార్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కె.ఎస్‌.రామారావు నిర్మించారు. ఆ రోజుల్లో సినిమా క్లాసిక్‌గా నిలిచింది. ఇన్నేళ్లయినా ఆ సినిమా గురించి, పాట గురించి మాట్లాడుకుంటున్నాం అంటేనే ఆ సినిమా తెలుగు పరిశ్రమ మీద, తెలుగు ప్రజల మీద వేసిన ముద్ర అలాంటిది. అయితే ఈ సినిమాను రీమేక్‌ చేద్దామని నిర్మాత అనుకుంటున్నారట. దీనికి నయనతార, అనుష్క, కీర్తి సురేశ్‌ లాంటి వాళ్లు అయితే బాగుంటారనేది నిర్మాత ఆలోచన.

కె.ఎస్‌.రామరావు ఆలోచనలో అయితే నయనతార అయితే బాగా నప్పుతుందని అనుకుంటున్నారు. అయితే మరి సినిమా ఎప్పుడు అనే మాట దగ్గరికొస్తే ఆయన రెమ్యూనరేషన్‌ గురించి మాట్లాడటం విశేషం. ప్రస్తుతం చాలామంది నటులు రెమ్యూనరేషన్‌కే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని, వాళ్లు తీసుకుంటున్న పారితోషికం వింటుంటూనే కంగారుగా ఉందని చెప్పారు. అంటే ‘మాతృదేవోభవ’ రీమేక్‌కు రెమ్యూనరేషనే అడ్డా అనే మాటలు వినిపిస్తున్నాయి.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus