వెయ్యి రూపాలతో పెట్టే చిన్న వ్యాపారానికైనా ముహూర్తం, పేరు బలం చూస్తుంటాం. అటువంటిది కోట్ల రూపాయలతో కూడిన సినిమాకి ఎన్నో రకాలుగా ముహుర్తాలు చూస్తుంటారు. హీరో, డైరక్టర్ కాంబినేషన్ నుంచి రిలీజ్ అయ్యే సీజన్ వరకు అన్నిటిలోను అలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. సెంటిమెంట్స్ ఫాలో అవుతుంటారు. ముఖ్యంగా టైటిల్ విషయంలోనూ అనేక జాగ్రత్తలు తీసుకుంటుంటారు. హీరోకు కలిసివచ్చే అక్షరాలతో సినిమా పేరు పెడుతుంటారు. అయితే తెలుగు పరిశ్రమకి “ఓ (o )” అక్షరం కలిసిరాలేదు. ఈ అక్షరంతో మొదలైన టైటిల్ గల సినిమాలు బాక్స్ ఆఫీస్ బోల్తాకొట్టాయి.
వన్ నేనొక్కడినే (one nenukadine) ఆరంజ్ (orange) ఊసరవెల్లి (oosaravalli) ఓయ్ (oye) ఒక్కడున్నాడు (okkadunnadu) ఓం 3d (om) ఓకే బంగారం (OK Bangaram) ఒక్క మగాడు (Okka magadu) ఒక్క అమ్మాయి తప్ప (Okka ammayi thappa) ఓం నమో వెంకటేశాయ (Om namo venkatesaya) ఆక్సిజన్ (Oxygen) ఒక లైలా కోసం (Oka Laila kosam) ఓ మై ఫ్రెండ్ (Oh my friend) ఒక్కడు మిలిగాడు (Okkadu miligadu) ఒంగోలు గిత్త (Ongole gitta) ఒక మనసు (Oka Manasu)
“ఓ (o )” అక్షరంతో మొదలైన టైటిల్ గల సినిమాలు తెలుగుచిత్ర పరిశ్రమకు ఈ ఉదాహరణ చాలు. మరి ఈ విషయం ఆ చిత్రాల నిర్మాతలకు తెలుసో తెలియదో.. మాకు తెలియదు .. కానీ “ఓ (o )” అక్షరంతో ప్రారంభమై ఫెయిల్ అయిన సినిమాలు మీకేమైనా తెలిసుంటే కామెంట్ చేయండి.