Jr NTR, Puri Jagannadh: ఆయన వాదనను పూరీ పట్టించుకోలేదా?

పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆంధ్రావాలా సినిమా ఏ రేంజ్ డిజాస్టర్ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తారక్ అభిమానులకు సైతం ఈ సినిమా అస్సలు నచ్చలేదనే సంగతి తెలిసిందే. 2004 సంవత్సరం జనవరి 1వ తేదీన విడుదలైన ఈ సినిమా తారక్ ఫ్యాన్స్ కు చేదు జ్ఞాపకంగా మిగిలింది. సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లోని ఎన్టీఆర్ గెటప్ పై సైతం నెగిటివ్ కామెంట్లు వినిపించాయి.

అయితే నిర్మాతలకు మాత్రం ఈ సినిమా ద్వారా పెద్దగా నష్టాలు రాలేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించింది. ఇదే సినిమాను మెహర్ రమేష్ కన్నడలో రీమేక్ చేస్తే అక్కడ మాత్రం ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ కావడం గురించి ఈ సినిమాకు ఎడిటర్ గా పని చేసిన మార్తాండ్ కె వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రావాలా సినిమా ఎడిటింగ్ సమయంలోనే ఆ సినిమా ఫలితం గురించి అంచనా వేశానని ఆయన చెప్పారు.

సినిమాలో సెకండాఫ్ లోని కొన్ని సన్నివేశాలు ఆశించిన విధంగా లేవని కొన్ని సన్నివేశాలలో మార్పులు చేయాలని మార్తాండ్ కె వెంకటేష్ సూచించారట. అయితే మార్పులు చేయకుండానే విడుదల చేయడంతో ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచిందని తెలుస్తోంది. పూరీ జగన్నాథ్ మార్పులు చేసి ఉంటే బాగుండేదని నెటిజన్లు సైతం సోషల్ మీడియాలో అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ నటించి విడుదలైన సినిమా కావడంతో ఆంధ్రావాలా సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు పెరిగాయి. రక్షిత, సంఘవి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించడం గమనార్హం. చక్రి ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా ఈ సినిమాలోని పాటలు సైతం హిట్ కావడం గమనార్హం. అయితే సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస విజయాలతో జోరుమీదున్నారు. టెంపర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు తారక్ వరుసగా ఆరు విజయాలను ఖాతాలో వేసుకున్నారు.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus