Ilaiyaraaja: కమల్ హాసన్ పాట వల్ల చిక్కుల్లో పడ్డ ‘మంజుమ్మల్ బాయ్స్’ టీం

  • May 23, 2024 / 02:08 PM IST

మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా (Ilaiyaraaja) ఎంత టాలెంటెడో, అంత కోపిష్టి కూడా..! ముఖ్యంగా ఈయన ట్యూన్స్ కానీ, పాటలు కూడా ఎవరైనా వాడితే ఈయన సహించరు. ఒకవేళ వాడితే ఈయనకి డబ్బులు కట్టేలా.. ఓ చట్టాన్ని ఈయన వాడుకుంటూ ఉంటారు అని అంతా అంటుంటారు. ఇదిలా ఉండగా.. తాజాగా మలయాళం ఇండస్ట్రీ హిట్ మూవీ అయిన ‘మంజుమ్మ‌ల్ బాయ్స్’ (Manjummel Boys) యూనిట్ సభ్యుల పై ఈయన కేసు వేయడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే..

ఇళయరాజా సంగీత దర్శకుడిగా పనిచేసిన ‘గుణ’ సినిమాలోని ‘క‌మ్మ‌ని ఈ ప్రేమ లేఖ‌’ అనే పాట చార్ట్ బస్టర్అయ్యింది. ఇప్పటికీ ఈ పాటని వింటూ ఎంజాయ్ చేసే బ్యాచ్ ఉన్నారు అంటే అతిశయోక్తి అనిపించుకోదు. అయితే ఈ పాట‌ను ఆయన అనుమతి లేకుండా ‘మంజుమ్మ‌ల్ బాయ్స్’ సినిమాలో వాడుకున్నారంటూ ఇళయరాజా కేసు వేయడం జరిగింది. తనకి రాయ‌ల్టీ చెల్లించి, క్షమాపణలు కోరాలని ఇళయరాజా డిమాండ్ చేస్తున్నారు.

అయితే ‘మంజుమ్మ‌ల్ బాయ్స్’ నిర్మాణంలో ఉండగానే ‘గుణ’ అడియో కంపైనీ వారి అనుమ‌తి తీసుకుని ఈ పాట‌ను తమ సినిమాలో వాడుకున్న‌ట్లు… ద‌ర్శ‌కుడు చిదంబ‌రం (Chidambaram S. Poduval) ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయినా ఇళయరాజా కేసు వేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. మరి ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.

ఇక రెండు నెలల క్రితం మలయాళంలో రిలీజ్ అయిన ‘మంజుమ్మాళ్ బాయ్స్’ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ కూడా కమల్ హాసన్ (Kamal Haasan) ‘గుణ’ సినిమాలోని కొన్ని సీక్వెన్స్ ల చుట్టూ తిరుగుతుంది. అందుకే టీం ఆ పాటని వాడినట్టు తెలుస్తుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus