ఈ మధ్యకాలంలో ఇళయరాజా ఏదొక విషయంపై తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నామధ్య ప్రధాని మోదీను పొగుడుతూ వార్తల్లోకెక్కారు. ఆ తరువాత రాజ్యసభ సీటు ఆఫర్ చేస్తున్నారని చెప్పుకున్నారు. అంతకముందు కాపీ రైట్స్ యాక్ట్ పై ఆయన కోర్టుకెళ్లారు. ఇలా తరచూ ఇళయరాజా పేరు వార్తల్లో కనిపిస్తోంది. ఇప్పుడు మరోసారి ఆయన పేరు వార్తల్లోకెక్కింది. దాదాపు రూ.2 కోట్ల మేర జీఎస్టీ ఎగ్గొట్టినందుకు ఆయనకు నోటీసులు అందాయి. వెంటనే జీఎస్టీ కట్టాలని..
లేదంటే తగిన చర్యలు తీసుకుంటామనేది ఆ నోటీసుల సారాంశం. గతంలో కూడా ఇళయరాజాకు ఇలాంటి నోటీసులే అందాయి. అయితే వాటిపై ఆయన రియాక్ట్ అవ్వలేదు. దీంతో ఇప్పుడు మరోసారి జీఎస్టీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు కూడా ఇళయరాజా నుంచి ఎలాంటి స్పందన రాకపోతే.. చట్టపరమైన చర్యలు తప్పవని తెలుస్తోంది. జీఎస్టీ అనేది కేంద్రానికి సంబంధించిన విషయం.
ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిలో పడడానికి ఇళయరాజా వ్యాఖ్యలు చేశారని.. ఆయన్ని పొగిడి రాజ్యసభ సీట్, లేదంటే పద్మ పురస్కారం అందుకోవాలని ఇళయరాజా ఆశపడ్డారని చెప్పుకున్నారు. ఇప్పుడు జీఎస్టీ విషయంలోనే కేంద్రం ఆయనను వదలడం లేదు. ఇక రాజ్యసభ సీట్ ఎక్కడ ఇస్తుంది..?
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!