Ravi Teja: కెరీర్ పరంగా మాస్ మహారాజ్ చేస్తున్న తప్పులు తెలిస్తే షాకవ్వాల్సిందే!

ఒకప్పుడు మినిమం గ్యారంటీ హీరోగా పేరు సంపాదించుకున్న హీరోలలో రవితేజ ఒకరు కాగా రవితేజ నటించిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం రవితేజ నటించిన సినిమాలలో ఒక సినిమా హిట్ అయితే రెండు సినిమాలు ఫ్లాపవుతున్నాయి. గత కొన్నేళ్లలో రవితేజ సినిమాలలో చాలా సినిమాలు బయ్యర్లకు భారీ షాక్ ఇస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. కెరీర్ విషయంలో రవితేజ చేస్తున్న తప్పుల వల్లే ఈ పరిస్థితి ఎదురవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

కథల ఎంపికలో, దర్శకుల ఎంపికలో రవితేజ చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆ తప్పుల వల్లే రవితేజ రెమ్యునరేషన్ పెరుగుతున్నా సక్సెస్ రేట్ పెరగడం లేదు. పాన్ ఇండియా సినిమాలుగా విడుదలైన రవితేజ సినిమాలు సైతం ఆయనకు షాకిస్తున్నాయి. ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమాలలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలపై కూడా పెద్దగా అంచనాలు లేవు. రవితేజ కెరీర్ విషయంలో తప్పటడుగులు వేస్తున్నారు.

రవితేజ (Ravi Teja) సీరియస్ సినిమాలు భారీ షాక్ ఇస్తున్నాయని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. రవితేజ రెమ్యునరేషన్ ప్రస్తుతం 22 కోట్ల రూపాయలుగా ఉంది. పెద్దగా క్రేజ్ లేని హీరోయిన్లు రవితేజకు జోడీగా నటించడం కూడా మాస్ మహారాజ్ కు మైనస్ అవుతోందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రవితేజ ఈ కామెంట్లపై ఎలా స్పందిస్తారో చూడాలి.

రావణాసుర మూవీ నిర్మాతలకు మాత్రం భారీ నష్టాలను మిగిల్చే ఛాన్స్ అయితే ఉంది. రవితేజ వరుస విజయాలను సొంతం చేసుకుని రికార్డులు క్రియేట్ చేయాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మాస్ మహారాజ్ రవితేజను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య తక్కువ కాదు. రవితేజకు మల్టీస్టారర్ సినిమాల ద్వారానే విజయాలు దక్కుతున్నాయని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus