India Lockdown Teaser: సమాజాన్ని ఓపెన్‌ మైండ్‌తో చూస్తే..!

కరోనా – లాక్‌డౌన్‌ అంటే మాస్కులు, శానిటైజర్లు, మందులు, ఆసుపత్రులు.. ఇవేనా. ఇంతకుమించి చాలానే ఉంది. మన ఇంట్లో, మన చుట్టుపక్కల, మనకు తెలియకుండా మన వెనుక, కింద, పైన.. ఇలా ఎక్కడ చూసినా కష్టాలే. పగోడికి కూడా ఆ కష్టం వద్దు అనుకునే పరిస్థితులు. సమాజంలోని కష్టాలను చూపించడానికి ముందుండే సినిమాలు ఈ విషయాన్ని పెద్దగా టచ్‌ చేయలేదు. ఏదో కామెడీ కోసం కరోనా సమయంలో ప్రజలు ఇళ్లలో ఇరుక్కుపోయి ఇబ్బంది పడ్డారు అని చూపించారు. కానీ గ్రౌండ్‌ రియాలిటీ వేరే ఉంది.

సగటు ఉద్యోగి, వ్యాపారి, కార్మికులు చాలా ఇబ్బందిపడ్డారు. వాటికి దృశ్య రూపం ‘ఇండియా లాక్‌డౌన్‌’. బాలీవుడ్‌లో సమకాలీన అంశాల ఆధారంగా సినిమాలు మధుర్‌ బండార్కర్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. జీ ఓటీటీలో ఈ సినిమాను స్ట్రీమ్‌ చేయనున్నారు. దీనికి సంబంధించిన టీజర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. సమాజంలో ధనిక వర్గం నుండి, సామాన్య వర్గం వరకు కరోనా – లాక్‌డౌన్‌ వల్ల పడ్డ ఇబ్బందులను ఈ సినిమాలో చూపించినట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతుంది.

శ్వేత బసు ప్రసాద్‌, ప్రతీక్‌ బబ్బర్‌, సాయి తమంకర్‌, ప్రకాశ్‌ బెలవాడి, అహన్‌కుమ్రాలు కీలక పాత్రల్లో నటించారు. డిసెంబరు 2 నుండి ఈ స్ట్రీమింగ్‌ ఉంటుంది. ఇక టీజర్‌ విషయానికొస్తే.. ఇంట్లో పనులు చేసుకున్న మెయిడ్స్‌ను కరోనా సమయంలో పనుల్లోకి రానివ్వలేదు. దాంతో చాలామంది ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్లు తిరుగు ప్రయాణాలు ప్రారంభిచారు. వాహన సౌకర్యం లేకపోవడంతో కాలినడకనే వెళ్లారు. ఆ కష్టాలు ఈ సినిమాలో చూడొచ్చు.

అలాగే వేశ్యా గృహాల్లో ఉన్న మహిళలు ఆ సమయంలో ఎంత ఇబ్బంది పడ్డారు అనేది కూడా సినిమాలో చూడొచ్చు. దీంతోపాటు భార్య భర్తల మధ్య వచ్చిన ఇబ్బందులు కూడా ఇందులో ప్రస్తావించారు. పైలెట్లు, ఎయిర్‌ హోస్టెస్‌ల కష్టాలకు కూడా ఈ సినిమా వేదికవుతుంది. కరోనా – లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు పడ్డ బాధల్ని అప్పట్లో మీడియా చాలా వరకు రాసుకొచ్చింది. కొన్ని దయనీమైన ఫొటోలు, వీడియోలు చూసి ప్రజలు ఏం చేయలేక మనసులోనే బాధపడ్డారు. అవన్నీ ఈ సినిమాలో ఉండబోతున్నాయి.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus