కమల్‌ని సౌతాఫ్రికా తీసుకెళ్తున్న శంకర్‌.. అవుట్‌పుట్‌ మామూలుగా ఉండదట!

శంకర్‌ సినిమా అంటే మినిమమ్‌ ఉంటుంది. అదేంటి శంకర్‌ను అందరూ మ్యాగ్జిమమ్‌ డైరక్టర్‌, భారీ చిత్రాల దర్శకుడు అంటారు కదా.. మీరేంటి మినిమమ్‌ అంటున్నారు అనుకుంటున్నారా? మీరు చెప్పింది కరెక్టే.. ఆయన సినిమాలు అన్నీ లార్జర్‌ ద్యాన్‌ లైఫ్‌లానే ఉంటాయి. అయితే ఆయన సినిమాల్లో మజా మినిమమ్‌ ఉంటుంది. అన్నీ క్లిక్‌ అయితే ఆ మజా కాస్త మ్యాగ్జిమమ్‌ అయిపోతుంది. ఇప్పుడు అలాంటి ఆలోచనే చేశారు శంకర్‌. దీని కోసం కమల్‌ హాసన్‌ను సౌతాఫ్రికా తీసుకెళ్తున్నారట.

శంకర్‌ తన సినిమాల్లో పాటలపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు అంటుంటారు. దాని కోసం ఆయన విదేశాలకు వెళ్తుంటారు. ఎవరూ చూడని, ఎవరూ చూపించని ప్రాంతాలను తన సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. తాజాగా ఇప్పుడు ‘ఇండియన్‌ 2’ కోసం అదే పని చేస్తున్నారట. దక్షిణాఫ్రికాలోని కీలక ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌ చేయడానికి ప్లాన్స్‌ చేస్తున్నారు. ఈ మేరకు త్వరలో ‘భారతీయుడు’ సౌతాఫ్రికా వెళ్లబోతున్నాడు. అయితే ఈసారి శంకర్‌ తీసుకెళ్తున్నది పాట కోసం కాదు, ఫైట్‌ కోసమట.

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ‘ఇండియన్ 2’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం ఓ భారీ ఫైట్ సీక్వెన్స్ ప్లాన్ చేశారట శంకర్. ట్రయిన్‌లో జరగబోయే ఈ ఫైట్‌ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అంటున్నారు. అయితే ఆ ఫైట్‌ను సౌతాఫ్రికాలో చిత్రీకరించడానికి ఓ కారణం ఉందని, అది సినిమా చూస్తేనే తెలుస్తుంది అని అంటున్నారు. అన్నట్లు ఆ ఫైట్‌ను అక్కడ రెండు వారాలపాటు చిత్రీకరిస్తారట.

శంకర్‌ – ట్రైన్‌ ఫైట్ అంటే మనకు ఠక్కున ‘రోబో’ సినిమా గుర్తొస్తుంది. ఆ సినిమాలో రోబో రజనీకాంత్ చేసిన ఫైట్‌ ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో తెలిసిందే. ఇప్పుడు ‘ఇండియన్‌ 2’లో కూడా అలాంటి ఫీలింగ్‌ కలుగుతుంది అని చెబుతున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌ నుండి ఎలాంటి లీక్‌లు రావడం లేదు. కానీ రామ్‌చరణ్‌ సినిమా నుండి వస్తున్నాయి. మరి సౌతాఫ్రికా షెడ్యూల్‌ నుండైనా ఏమైనా లీక్‌లు వస్తాయేమో చూడాలి.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus