భారతదేశంలో మొదటిసారి సూపర్‌గర్ల్ కథాంశంతో విజువల్ వండర్‌గా రాబోతున్న చిత్రం `ఇంద్రాణి`. వినూత్న తరహాలో భారీ వీఎఫ్ఎక్స్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ద్వారా స్టీఫెన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యానియా భరద్వాజ్, కబీర్ సింగ్, ఫ్రణిత జిజిన ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంద్రాణి మూవీ ఈ రోజు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నరేష్ విజయకృష్ణ క్లాప్ కొట్టగా నిర్మాత బెక్కం వేణుగోపాల్ కెమెరా స్విఛాన్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఇంద్రాణి మోషన్‌పోస్టర్‌ను తుంబాడ్(హింది) దర్శకుడు రాహి అనిల్ బార్వే విడుదల చేశారు.
సీనియర్ నటుడు నరేష్ మాట్లాడుతూ – “ఫస్ట్ ఇంద్రాణి టీమ్ అందరికీ కంగ్రాచ్యులేషన్స్…మోషన్ పోస్టర్ చూడగానే గూజ్‌బమ్స్ వచ్చాయి. స్టీపెన్, స్టాన్లీ నాకు దాదాపు ఎనిమిదేళ్లుగా తెలుసు. చాలా కచ్చితత్వం ఉన్న వ్యక్తులు. పక్కా ప్రణాలికతోనే ముందుకు వెళ్తారు. మంచి మనుషులు మంచి కాన్సెప్ట్‌తో వస్తున్నారు. ఈ సినిమా అన్ని భాషల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ – “పక్కా కంటెంట్ ను నమ్మి చేస్తున్న చేస్తున్న చిత్రమిది. మోషన్‌పోస్టర్ అద్భుతంగా ఉంది. ఈ సినిమాను అన్ని భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు..కొత్తదనం కోసం ప్రయత్నం చేస్తున్న ఈ సినిమా తప్పకుండా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
రాహి అనిల్ బార్వే మాట్లాడుతూ – “రెండున్నర సంవత్సరాల పాటు స్క్రిప్ట్‌పై కసరత్తులు చేసి స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి? చాలా గ్రాండ్‌గా VFX వర్క్ ఎలా జరగాలి అనేదానిపై ఓ అంచనాకు వచ్చి చేస్తున్న చిత్రమిది. మోషన్ పోస్టర్ అమేజింగ్‌గా ఉంది. తప్పకుండా టీమ్ అందరికీ మంచి పేరు వస్తుందని నమ్ముతున్నాను. సాయి కార్తీక్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ టీం అందరికీ అల్ ద బెస్ట్“ అన్నారు.
సంగీత దర్శకుడు సాయి కార్తీక్ మాట్లాడుతూ – “మన సినిమా ఇండస్ట్రీకు కూడా సూపర్ బాయ్, సూపర్ ఉమెన్, సూపర్ విలన్ లు రావాలి. రెగ్యులర్ కమర్షియల్ సినిమా చేయకుండా ఒక విభిన్న చిత్రం చేస్తున్న మా స్టీఫెన్, స్టాన్లీకి కంగ్రాచ్యులేషన్స్..అవేంజర్స్‌లా ఈ సినిమా తీయాలని కోరుకుంటూ టీం అందరికీ అల్ ద బెస్ట్“ అన్నారు.
యానియా భరద్వాజ్ మాట్లాడుతూ – `ఇంద్రాణి పాత్రే నన్ను సెలక్ట్ చేసుకుంది. ఈ సినిమాలో నాకు మంచి రోల్ ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది“ అన్నారు.
చిత్ర దర్శకుడు స్టీఫెన్ మాట్లాడుతూ – “ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాను. చిన్నపిల్లలందరికి ఇండియాలో సూపర్ హీరో లేరు. ఈ సినిమా రిలీజ్ తరువాత ఇంద్రాణి గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటారు. ఇది ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో వస్తున్న పక్కా మాస్ మార్వెల్ సినిమా. అన్ని రకాల కమర్షియల్ అంశాలు ఉంటాయి. ప్రపంచం మొత్తం ఇంద్రాణి వైపు చూసేలా క్రియేటివ్ వరల్డ్ లా ఈ సినిమాను భారీ బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో రూపొందింస్తున్నాం. ఇంద్రాణి పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. వాటన్నింటికి యానియా భరద్వాజ్ ప్రోఫైల్ సరిగ్గా సరిపోవడంతో లీడ్ క్యారెక్టర్‌కు ఆమెను సెలక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంది. యామిని యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకుల్ని తప్పకుండా అలరిస్తాయి“ అన్నారు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్టాన్లీ సుమన్ బాబు మాట్లాడుతూ – “ రెండున్నర సంవత్సరాల పాటు శ్రమించి స్టీఫెన్ చాలా అద్భుతమైన కథను రెడీ చేశారు. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయి. సాయి కార్తీక్ మ్యూజిక్ సినిమాకు హైలైట్ అవుతుంది“ అన్నారు.
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?