అక్కినేని నాగార్జున హీరోగా కె.రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో అప్పటికే ‘అగ్ని పుత్రుడు’ ‘ఆఖరి పోరాటం’ ‘జానకి రాముడు’ ‘అగ్ని’ వంటి సినిమాలు వచ్చాయి. ఇందులో ‘అగ్ని పుత్రుడు’ ‘అగ్ని’ వంటి సినిమాలు ప్లాపులు అవ్వగా మిగిలిన రెండు హిట్ అయ్యాయి. అయితే మిగిలిన రెండు సినిమాలు హిట్ అయినా నాగార్జునకి మాస్ ఇమేజ్ ను తెచ్చిపెట్టే సినిమాలుగా నిలవలేకపోయాయి. ‘జానకి రాముడు’ అనే మూవీ పూర్తిగా కథ నచ్చే జనాలు చూశారు.
ఆ సినిమాల్లో నాగ్ కాకుండా వేరే హీరో చేసినా సూపర్ హిట్ అవుతుంది అనే కామెంట్స్ వినిపించాయి. మరోపక్క ‘ఆఖరి పోరాటం’ సినిమా హిట్ అయినా క్రెడిట్ అంతా శ్రీదేవి ఖాతాలో పడిపోయింది. ఓ విధంగా ఆ సినిమాలో ఆమెనే హీరో అన్నట్టు ఉంటుంది ఆమె పాత్ర. ఇక ‘అగ్ని’ వరకు నాగ్ చేసిన మాస్ ప్రయత్నాలు అన్నీ బెడిసికొట్టాయి. అయితే అనూహ్యంగా ‘వారసుడు’ ‘అల్లరి అల్లుడు’ ‘హలో బ్రదర్’ వంటి సినిమాలు నాగ్ కు మాస్ ఇమేజ్ ను తెచ్చిపెట్టాయి.
మధ్యలో ‘క్రిమినల్’ అనే సినిమా చేసి నాగ్ మళ్ళీ ప్లాప్ ను మూటకట్టుకున్నాడు. అలాంటి టైములో వచ్చిన ‘ఘరానా బుల్లోడు’ మూవీ నాగ్ ను మాస్ ఆడియెన్స్ కు మరింత దగ్గర చేసింది. ‘ఆర్.కె.ఫిలిం అసోసియేట్స్’ బ్యానర్ పై రాఘవేంద్ర రావు గారి సోదరుడు కృష్ణ మోహన రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. అప్పటికే ‘ఘరానా’ అనే పదం సూపర్ హిట్లకి కేరాఫ్ అడ్రెస్ గా మారింది. ‘ఘరానా మొగుడు’ తో చిరుకి ఓ బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు రాఘవేంద్ర రావు గారు తెరకెక్కిస్తున్న మూవీ కావడం
అలాగే ‘భీమవరం బుల్లోడా’ వంటి పాటలు సూపర్ హిట్ అవ్వడంతో సినిమా పై పాజిటివిటీ ఏర్పడింది. అలా 1995 వ సంవత్సరం ఏప్రిల్ 27న వచ్చిన ‘ఘరానా బుల్లోడు’ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో జట్కా బండి తోలుకునే వాడుగా నాగ్ కనిపిస్తారు. ఆమని సెకండ్ హీరోయిన్ గా రమ్యకృష్ణ మెయిన్ హీరోయిన్ గా నటించింది. నేటితో ఈ మూవీ రిలీజ్ అయ్యి 27 ఏళ్ళు పూర్తి కావస్తోంది.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!