సూపర్ స్టార్ కృష్ణగారు.. తన సోదరులు జి.హనుమంతరావు, జి.ఆదిశేషగిరిరావు లను చేసి… ‘పద్మాలయా పిక్చర్స్’ సంస్థను స్థాపించి మొదటి ప్రయత్నంగా ‘అగ్నిపరీక్ష’ అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం ప్లాప్ అయ్యింది. మొదటి చిత్రమే డిజాస్టర్ అయ్యింది. అయినా పట్టుబట్టి.. ‘మోసగాళ్ళకు మోసగాడు’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. 1971 ఆగస్టు 27న ‘మోసగాళ్ళకు మోసగాడు’ చిత్రం విడుదలైంది. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అప్పటి వరకు టాలీవుడ్లో ఎవ్వరూ కౌబాయ్ జోనర్ ను టచ్ చేయలేదు.
ప్రేక్షకులను వినూత్నంగా అలరించాలని కృష్ణ గారు ‘మోసగాళ్ళకు మోసగాడు’ చిత్రాన్ని చేశారు. నిర్మాతలైన జి.హనుమంతరావు, జి.ఆదిశేషగిరిరావు లు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. కథ డిమాండ్ చేయడంతో రాజస్థాన్ ఎడారిలో చిత్రీకరణ నిర్వహించారు.కె.ఎస్.ఆర్ దాస్ కూడా ఈ చిత్రాన్ని ఎంతో శ్రద్ధతో తెరకెక్కించారు. ఆదినారాయణరావు సంగీతం అందించారు. ప్రేక్షకులకు కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇప్పటికీ ఈ మూవీ ఫ్రెష్ గానే అనిపిస్తుంది. ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్స్ అంతా సేఫ్ అయ్యారు.
కానీ కృష్ణగారు అండ్ టీం కు ఈ మూవీ లాస్ వెంచరే. ఆ రోజుల్లో ఈ చిత్రాన్ని రూ.7 లక్షల భారీ బడ్జెట్ తో నిర్మించారు. అప్పట్లో నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో వచ్చే రాబడి ఏమీ లేదు. సినిమాని రూ.4.5 లక్షలకు విక్రయించారు. రూ.2.5 లక్షల వరకు కృష్ణగారికి నష్టాలు వచ్చాయి. అయితే ప్రేక్షకులకు కృష్ణగారి సినిమాల పై వ్యామోహం పెరిగింది అంటే అది ఈ సినిమా వల్లనే అని చెప్పాలి. అంతేకాదు ఆయనకి స్టార్ డం తెచ్చిపెట్టిన చిత్రాల్లో ఇది కూడా ఉంటుంది.