HIT2: ‘హిట్2’ సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్!

అడివి శేష్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా ‘హిట్2’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 2న రిలీజ్ కానుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ను కూడా ఇప్పటికే మొదలుపెట్టారు. టీజర్, సాంగ్, ట్రైలర్ ఇలా ఒక్కొక్కటిగా రిలీజ్ చేశారు. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ అంచనాలను పెంచేసింది. దానికి తగ్గట్లుగానే సినిమాపై హైప్ తీసుకొచ్చేలా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి రాజమౌళిని గెస్ట్ గా తీసుకొస్తున్నారు.

ఇక రీసెంట్ గానే ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ ను పూర్తి చేసుకుంది. ఈ మధ్యకాలంలో నిడివి ఎక్కువ సినిమాలను చూడడానికి జనాలు ఇబ్బందిపడుతున్నారు. కంటెంట్ బాగున్నప్పటికీ.. కొన్ని సార్లు రన్ టైం ఎక్కువవ్వడం వలన ప్రేక్షకులపై ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే రన్ టైం విషయంలో దర్శకనిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కథను ఎంత క్రిస్పీగా చెబితే జనాలకు అంతగా కనెక్ట్ అవుతుంది. అందుకే ‘హిట్2’ రన్ టైం తక్కువ ఉండేలా చూసుకున్నారు.

కేవలం 2 గంటల్లో హిట్ 2 సినిమా పూర్తవుతుందట. సెన్సార్ బోర్టు ఈ సినిమాకి ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చింది. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఆసక్తికరంగా సాగిందని.. సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ అందరినీ ఆశ్చర్యపరుస్తుందని చెబుతున్నారు. ‘హిట్1’ సినిమాలో విశ్వక్ సేన్ నటించారు. ‘హిట్ 2’ హీరోగా అడివి శేష్ ను తీసుకున్నారు.

‘హిట్ 3’ హీరోగా కూడా మారబోతున్నారు. ఆ హీరోని ‘హిట్2’ క్లైమాక్స్ లో రివీల్ చేయబోతున్నారు. సినిమాలో ఇదొక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ సినిమాను నాని నిర్మించారు. ముందుగా ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ఆ తరువాత మిగిలిన భాషల్లో రిలీజ్ కానుంది.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus