Rangasthalam Movie: ‘రంగస్థలం’ లిప్‌లాక్‌ గురించి తెలుసా…?

‘రంగస్థలం’ సినిమా చూస్తున్నప్పుడు ఫ్యాన్స్‌కు షాక్‌ ఇచ్చే సీన్స్‌ చాలానే ఉంటాయి. అవన్నీ సినిమా లవర్స్‌కి బాగా నచ్చుతాయి. అయితే అందులో కుర్రకారుకు కిక్‌ ఇచ్చే సీన్ మాత్రం ఒకటి ఉంది. అదే రామ్‌చరణ్‌ను సమంత లిప్‌లాక్ ఇచ్చే సీన్. చిట్టిబాబును పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తుండటంతో… తన ప్రేమను వ్యక్తం చేయడానికి రామలక్ష్మి వచ్చి ముద్దు పెట్టేస్తుంది. ఆ సీన్‌ చూసి… ఇదేంటి అని షాక్‌ అయ్యారు జనాలు. ప్రేక్షకులే కాదు… ఆ సీన్‌లో చరణ్‌ కూడా షాక్‌ అయ్యాడట.

‘రంగస్థలం’లో రామ్‌చ‌ర‌ణ్, స‌మంత‌ కెమిస్ట్రీ వావ్‌ అనిపిస్తుంది. అయితే సినిమాలో లిప్ లాక్ సీన్‌ వెనుక చాలా పెద్ద కథే న‌డిచిందట‌. చ‌ర‌ణ్‌కి సుకుమార్ కథ చెప్పిన‌ప్పుడే ఈ లిప్ లాక్ సీన్ గురించీ వివరించారట. ఆ సమయంలో ఈ సీన్ గురించి రామ్‌చ‌ర‌ణ్- సుకుమార్ మ‌ధ్య పెద్ద చర్చే న‌డిచిందట. ‘లిప్ లాక్ సీన్లు వ‌ద్దంటే వద్దు. ఉపాస‌న‌కు ఇలాంటి సీన్స్‌ నచ్చవు’ అని చరణ్‌ కరాఖండిగా చెప్పేశాడట. దానికి సుకుమార్ ఓకే అని చెప్పాడట. కానీ ఆ సీన్‌ సినిమాలో ఉంది. ఎలా అంటే.

సినిమాలో ఈ సీన్‌ ఎంత ముఖ్యమో సుకుమార్‌కు తెలుసు. చిట్టిబాబుకు రామలక్ష్మి తన ప్రేమను అలా వివరిస్తేనే… ప్రేక్షకులకు కనెక్ట్‌ అవుతుంది అనుకున్నారట. సినిమా మొదలయ్యాక… మెల్ల‌మెల్ల‌గా చ‌ర‌ణ్‌ని ఒప్పించొచ్చులే అనుకున్నారట సుక్కు. అయితే సుకుమార్‌ ఎంత ప్రయత్నించినా పని అవ్వలేదు. ఈ సీన్ గురించి ఎప్పుడు చ‌ర్చ వ‌చ్చినా చ‌ర‌ణ్ మొహ‌మాటం లేకుండా ‘ఈ సీన్ వ‌ద్దన్నాను క‌దా’ అని చెప్పేసేవాడ‌ట‌. తీరా సీన్‌ తీసే రోజు వచ్చేసరికి సుకుమార్‌ తన లెక్కల బ్రెయిన్‌కి పని పెట్టారు.

‘రామ్‌చ‌రణ్‌కి లిప్ లాక్ పెట్టు’ అని స‌మంత‌కి చెప్పారట సుకుమార్‌. చ‌ర‌ణ్‌కి ‘సమంత దగ్గరికొస్తుంది… పెదాలు ద‌గ్గ‌ర‌గా వ‌స్తాయంతే’ అని చెప్పారట. ఆ తర్వాత గ్రాఫిక్స్‌లో చూసుకోవచ్చు అన్నారట. అంతా ఓకే అనుకొని సుకుమార్ యాక్ష‌న్ చెప్ప‌గానే.. స‌మంత నేరుగా లిప్ లాక్ ఇచ్చేసింద‌ట‌. దీంతో చరణ్‌ ఒక్కసారి షాక్‌ అయ్యాడట. ఆ తర్వాత సుకుమార్‌పై చరణ్‌ అలిగాడనీ… తర్వాత సీన్‌ ఇంపార్టెన్స్‌ గురించి సుకుమార్‌ వివరిస్తే కన్విన్స్‌ అయ్యాడట చరణ్‌.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus