Veta Movie: మెగాస్టార్ వేట గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో మెచ్చిన కథలో మరో హీరో నటించడం కొన్ని సందర్భాల్లో జరుగుతోంది. చిరంజీవి కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కి ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోని సినిమాలలో వేట సినిమా కూడా ఒకటి. అయితే ఈ సినిమాలో నటించాలని బాలయ్య భావించారని సమాచారం. ద కౌంట్‌ ఆఫ్‌ మాంటి క్రిస్టో అనే పేరుతో ఫ్రెంచ్ లో అలెగ్జాండర్‌ డ్యూమాస్‌ ఒక నవలను రాశారు. ఈ నవల ఆధారంగా ఇంగ్లీష్ లో, ఫ్రెంచ్ లో పలు సినిమాలు తెరకెక్కాయి.

1950 సంవత్సరం సమయంలో ఈ నవలను తెలుగులోకి అనువదించగా యాక్షన్ సన్నివేశాలతో పాటు ఆసక్తికర మలుపులు ఈ సినిమా కథలో ఉన్నాయి. కథ ప్రకారం ఏ పాపం తెలియని వ్యక్తిపై కొంతమంది కుట్ర చేసి నేరం మోపి జైలుకు పంపించగా ఆ వ్యక్తి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తనకు అన్యాయం చేసిన వాళ్లను టార్చర్ చేసి చంపుతాడు. బాలకృష్ణకు ఈ కథ గురించి తెలిసి ఇతర భాషల్లో తెరకెక్కిన సినిమాలను చూశారు.

ఈ సినిమాలో బాలయ్య నటించాలని భావించినా వేర్వేరు కారణాల వల్ల ఆయన చేయలేకపోయారు. ఆ తర్వాత సంయుక్తా మూవీస్ అధినేత తిరుపతి రెడ్డి చిరంజీవి, కోదండరామిరెడ్డికి కథ చెప్పి వేట సినిమాను మొదలుపెట్టారు. అప్పట్లోనే దాదాపుగా కోటి రూపాయల ఖర్చుతో ఈ సినిమా తెరకెక్కగా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదు. ఈ సినిమాలో చిరంజీవి కొత్త గెటప్స్ లో కనిపించారు.

ఈ సినిమా కొరకు మెగాస్టార్ చిరంజీవి 60 రోజుల పాటు పని చేశారు. చిరంజీవికి జోడీగా జయప్రద నటించగా ఆమె ఈ సినిమా కొరకు 38 రోజులు పని చేయడం గమనార్హం. ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా చిరంజీవి అభిమానులకు ఈ సినిమా ఎంతగానో నచ్చింది. చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలతో చిరంజీవి ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus